బిజినెస్

విద్యుత్ వాహనాల పెంపు దిశగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారిత వాహనాల పెంపుపై దృష్టి సారించింది. దేశీయ ఇంధన అవసరాల్లో అధిక శాతం విదేశీ దిగుమతుల ద్వారానే తీరుతుండటం, కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో విద్యుత్ ఆధారిత వాహనాల వాడకం పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే 2030కల్లా అన్ని కార్లు ఎలక్ట్రిక్‌వే అయ్యుండాలని అనుకుంటోంది. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ఇక్కడ జరిగిన సిఐఐ వార్షిక సదస్సు-2017కు హాజరైన సందర్భంగా చెప్పారు. విద్యుత్ ఆధారిత వాహన తయారీ పరిశ్రమనూ ప్రోత్సహిస్తామన్నారు.