ఫోకస్

ప్రభుత్వాలది ద్వంధ్వవైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాన పనికి సమాన వేతనం అని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో ధ్వంధ్వ వైఖరి అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ విధులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు అనే పేరుతో విధులను నిర్వర్తిస్తుంది. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పింఛను వంటి సదుపాయాలు లేకుండానే పనిచేయాల్సి వస్తుంది. ఈ విధానం గత కాంగ్రెస్ హయాంలో నెమ్మదిగా ప్రారంభమైంది. ఆ తరువాత అంచెలంచెలుగా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేశారు. వీరికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఇటీవల నీతి ఆయోగ్ కూడా దేశంలో ఇకపైన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను తీసుకొవాలని సూచించింది. భారతదేశ చరిత్రలో ఉపాధి రంగాన్ని దెబ్బతీసే విధానం ఇది. యాజమాన్యాలు పిఎఫ్, ఇఎస్‌ఐ, టాక్స్‌లు వంటివి చెల్లించనక్కర లేదు. ఒకపక్క సమాన పనికి సమాన వేతనం చట్టం ఉంటుండగా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. సమాన పనికి సమాన వేతనం అన్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు త్రిమెన్ కమిటీని నియమించడం వెనుక అంతరార్థం అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట వల్లె వేస్తున్నారు. ఈ విధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాజకీయంలో పావులుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం కారణం.

- భీశెట్టి బాబ్జి లోక్‌సత్తా ఎపి అధ్యక్షుడు