బిజినెస్

‘ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సవాళ్లను అధిగమించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, బిజినెస్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు కృషి చేయాలని, ఆధునిక ఐటిని అధ్యయనం చేయాలని సీ రిడ్జెస్ బిజినెస్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ రంగభాష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నైపుణ్యాభివృద్ధిని సాధించేందుకు పారిశ్రామికవేత్తలు సంఘటితంగా పని చేయాలన్నారు. ఆదివారం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రొగ్రామ్‌పై జరిగిన శిక్షణ తరగతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ మానవ వనరులను హైరింగ్ చేయడంపై పెట్టుబడులు పెట్టాలా లేక ఉన్న మానవ వనరులకు శిక్షణ ఇవ్వాలా లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిని ఎన్నుకోవాలా అనే దానిపై పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఈ అంశాలపై అనేక సవాళ్లు ఎదురవుతాయన్నారు. పారిశ్రామిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు దీర్ఘకాల, స్వల్పకాలిక వ్యూహాలు అవసరమన్నారు. కాగా, వనరుల సమీకరణ కూడా ఒక వ్యూహమని, వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులు తమ మేధస్సును పరిశ్రమల అభివృద్ధికి వినియోగించాలని, తమ భావాలను పంచుకునేందుకు సరైన వేదికను పంచుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉండే పారిశ్రామికవేత్తలు సాధారణంగా ఎదుర్కొనే సవాళ్లను ఆయన ప్రస్తావించారు. సురానా గ్రూప్ నుంచి వినిత సురానా పారిశ్రామిక రంగం విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్‌క్లేస్, విఎంవేర్, వియాకామ్, డొమినోస్ పిట్జాస్, సనోఫి, టెస్కో మైక్రోల్యాండ్, ఐబిఎం, మైకా, క్లచ్ గ్రూప్, హానీ వెల్ సంస్ధకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

జిఎస్‌టితో దేశీయ సంస్థలకు మేలు: అధియా
వడోదర, మే 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)తో భారతీయ సంస్థలు విదేశీ సంస్థలకు మరింత పోటీయుతంగా తయారవుతాయన్న ఆశాభావాన్ని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ ఇండస్ట్రీస్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వడోదర జోన్ చీఫ్ కమిషనర్ సంయుక్తంగా జిఎస్‌టిపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిఎస్‌టి అమలుతో దేశవ్యాప్తంగా ఒకేతరహా పన్ను విధానం ఉంటుందని, దీనివల్ల భారత వ్యాపార ముఖచిత్రం మారిపోతుందని చెప్పారు. జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది తెలిసిందే.

ఎన్‌డిటివితో
ఎయిర్‌సెల్ భాగస్వామ్యం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 7: స్మార్ట్ఫోన్లకు అధిక స్థాయిలో డిమాండ్ పెరుగుతున్న వేళ ప్రాంతీయ కంటెంట్‌కు అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతున్నందున వినియోగదారుల అవసరానికి అనుగుణంగా సమాచారం అందించేందుకు ప్రముఖ జాతీయ వార్తా చానల్ ఎన్‌డిటివితో దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా నెలకు 36 రూపాయలతో హైపర్ లోకల్ న్యూస్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్, మై సిటీ మై న్యూస్‌ను ఆవిష్కరించినట్లు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఆదివారం చెప్పారు. ఈ సేవల ద్వారా స్థానిక, జాతీయ, వినోద సమాచారం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్‌పురి, తమిళ భాషల్లో ఎయిర్‌సెల్ చందాదారులకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.