బిజినెస్

షిప్‌యార్డును ఆర్థికంగా బలపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. బుధవారం ఎంపీలు కొనకళ్ల నాగేశ్వరరావు, అవంతి శ్రీనివాసరావు, హరిబాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి షిప్‌యార్డును చౌదరి సందర్శించారు.
ఆ తరువాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సదుపాయం షిప్‌యార్డుకు అక్కర్లేదని, ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేస్తే సరిపోతుందన్నారు. ఇందుకు తాను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. దీనివలన స్వల్ప ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న షిప్‌యార్డు కోలుకుంటుందని, దేశంలోని మిగిలిన షిప్‌యార్డులతో పోటీపడే సత్తా వస్తుందని అన్నారు.
ఫలితంగా ఆర్డర్స్ కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు. అలాగే తన శాఖకు రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ కోసం కొన్ని నౌకలు నిర్మించాల్సిన అవసరం ఉందని వీటి నిర్మాణ బాధ్యత ఈ షిప్‌యార్డుకు అప్పగించే అవకాశం ఉందని మంత్రి సుజనా తెలియచేశారు. హిందుస్థాన్ షిప్‌యార్డు ఒక వజ్రమని, దాన్ని పూర్తి స్థాయిలో వినయోగించుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. కాగా, ఈ షిప్‌యార్డులో స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతామని ఆయన చెప్పారు.
ఇందుకు యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తామని ఆయన తెలియచేశారు. మంత్రి వెంట షిప్‌యార్డు సిఎండి రియర్ అడ్మిరల్ ఎల్‌వి శరత్ బాబు తదితరులు ఉన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి