బిజినెస్

దీటైన ప్రత్యామ్నాయం సీపెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) అభయ హస్తం ఇస్తోంది. చదువు పూర్తికాగానే ఉద్యోగం ఆర్డర్ తీసుకునే సదావకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలోని 30 పట్టణాల్లో ఉన్న ఈ సంస్థ ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని భిన్నమైన కోర్సులను ఆఫర్ చేస్తోంది. పిజి డిప్లొమో కోర్సులు, డిప్లొమో కోర్సులు, స్వల్పవ్యవధి సర్ట్ఫికేట్ కోర్సులను అందిస్తున్న ఈ సంస్థ శిక్షణ పూర్తికాగానే వెంటనే వివిధ సంస్థలతో మాట్లాడి ఉద్యోగాలను కూడా ఇస్తోంది. శిక్షణ పొందిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలున్నాయని సంస్థ డైరెక్టర్ వి కిరణ్‌కుమార్ తెలిపారు. పాత్రికేయులతో మాట్లాడిన అనంతరం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలు వివరించారు.
* సీపెట్ గురించి చెప్తారా?
- సెంటర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వ సంస్థ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధీనంలో రసాయనాలు, పెట్రో రసాయనాలు విభాగంలో పనిచేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దేశవ్యాప్తంగా 30 శాఖలున్నాయి. హైదరాబాద్‌లో 1987లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్స్, సంబంధిత అవసారను తీర్చడానికి సీపెట్‌ను ఏర్పాటు చేసింది.
* సీపెట్ ధ్యేయం ఏమిటి?
- ప్లాస్టిక్ సంబంధిత పరిశ్రమకు సాంకేతిక సుశిక్షితులైన మానవ వనరులను అందించడం కోసం వివిధ దీర్ఘకాలిక, స్వల్పకాలిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇవ్వడమే సీపెట్ ముఖ్య ధ్యేయం. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దీర్ఘకాలిక శిక్షణ కార్యక్రమాల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
* సీపెట్ ఏ కోర్సులను ఆఫర్ చేస్తోంది?
- సీపెట్ పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ , పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లొమో ఇన్ వౌల్డ్ డిజైన్ విత్ సిఎడి/సిఎఎం, డిప్లొమో ఇన్ వౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ వంటి విద్యాసంబంధ శిక్షణ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. పిజి డిప్లొమో ఏడాదిన్నర వ్యవధి ఉంటాయి. డిప్లొమో కోర్సులు మూడేళ్ల వ్యవధి ఉంటాయి. వీటన్నింటికీ ఎఐసిటిఇ అనుమతి ఉంది.
* పిజి డిప్లొమోల్లో చేరాలంటే..?
- పిజి డిప్లొమో కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ జారీ చేశాం. దరఖాస్తుచేసుకునేందుకు జూన్ 2 ఆఖరు తేదీ. వీరందరికీ ఉమ్మడి ప్రవేశపరీక్షను జూన్ 25న పలు కేంద్రాల్లో నిర్వహిస్తాం. ఫలితాలను ఫలితాలు జూలై మొదటి వారంలో ప్రకటించి, జూలై రెండో వారంలో అడ్మిషన్ కాల్ లెటర్స్ పంపిస్తాం, ఆగస్టు 1వ తేదీ నుండి తరగతులు మొదలవుతాయి. విజయవాడ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలున్నాయి.
* స్వల్పవ్యవధి కోర్సులున్నాయా?
- ఇంజక్షన్ మెషిన్ ఆపరేటర్ ఇన్ ప్లాస్టిక్స్, ఎక్స్‌ట్రూడర్ మెషిన్ ఆపరేటర్ ఇన్ ప్లాస్టిక్స్, సిఎన్‌సి లేత్ మిషన్ ఆపరేటర్, సూపర్‌వైజరీ లెవెల్ ట్రైనింగ్ ఇన్ ప్లాస్టిక్స్ ప్రోడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ కోర్సులు మూడు నెలల వ్యవధి ఉన్నవి ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులను టెన్త్ పాసైన వారు, ఫెయిల్ అయిన వారు కూడా చేయవచ్చు. అయితే 25 ఏళ్లులోపు వారు మాత్రమే అర్హులు. దీనికి ఎలాంటి ప్రవేశపరీక్ష ఉండదు. చర్లపల్లిలోని ఐడిఎ ఫేజ్-2లోని సీపెట్ కార్యాలయానికి వస్తే అక్కడే పేర్లు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.
* స్వల్పవ్యవధి కోర్సులు చేసిన వారి పరిస్థితి ఏమిటి?
- మార్కెట్‌లో వేలాది మంది అవసరం ఉంది. కాని శిక్షణ పొందిన వారు వందల్లో ఉన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్లాస్టిక్స్‌లో పేరిన్నికగన్న సుధాకర్ పైప్స్, నంది పైపులు, గోదావరి పాలిమర్స్, మారుతి ట్యూబ్స్, అమృతా టూల్ క్రాఫ్ట్స్, ఎన్‌సిఎల్, నాగార్జున ఫెర్టిలైజర్స్, ఫెన్నార్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. వీరికి ఎలాంటి ఫీజు ఉండదు, సరికదా స్కాలర్‌షిప్‌లను కూడా అందించడం జరుగుతుంది.
* ఏ విధమైన శిక్షణ అందిస్తారు?
- విద్యలోనూ, పరిశోధనలోనూ, నూతన ఆవిష్కారాలలోనూ శ్రేష్ఠతను పోషించడంలో సీపెట్ ఒక సాధకంగా ఉంది. అత్యుత్తమ బోధన, సుశిక్షణ, చక్కటి అభ్యాస పద్ధతుల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా అధిక నాణ్యత ఉన్న శిక్షణ క్రమాన్ని పెంచి పోషిస్తోంది.
* సీపెట్ కేంద్రాలు ఎలా పనిచేస్తాయి?
- అందుబాటులోని వౌలిక సదుపాయాలు, శాఖలు, పరిశ్రమల ప్రాతినిధ్యం ప్రాతిపదికగా సీపెట్ తన కేంద్రాలను నాలుగు కేటగిరిలుగా వర్గీకరించింది. స్పెషలైజ్డ్ కేంద్రాలు, హై లెర్నింగ్ కేంద్రాలు, అదర్ లెర్నింగ్ కేంద్రాలు, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు కింద పనిచేస్తాయి. వీటిలో స్పెషలైజ్డ్ కంద్రాలు వాటి నిర్ధిష్ట డొమైన్లుకు సంబంధించిన విద్యా సంబంధ కార్యక్రమాలతో పాటు టెక్నాలజీ సపోర్టు సేవలు కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఐదు హైలెర్నింగ్ సెంటర్లు, 12 అదర్ లెర్నింగ్ సెంటర్లు, ఇంకో మూడు స్పెషలైజ్డ్ సెంటర్లు, రెండు పరిశోధన అభివృద్ధి విభాగాలున్నాయి. ఐదు వృత్తి విద్యాకేంద్రాలున్నాయి, మరో పెట్రో కెమికల్ డాటా సర్వీసు సెంటర్ కూడా పనిచేస్తోంది. పాలిమర్ సంబంధిత పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు అదనంగా 11 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
* కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసే
యోచన ఉందా?
- తెలంగాణలో మెదక్, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, విశాఖపట్టణంలలో కొత్త కేంద్రాలు వస్తాయి. మెదక్‌లో హై లెర్నింగ్ కేంద్రం , అనంతపురం, విశాఖల్లో వొకేషనల్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడ పని మొదలైంది. త్వరలోనే పూర్తి స్థాయి సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయి.
* ఫీజులు ఎలా ఉంటాయి?
- పిజి డిప్లొమో కోర్సులకు సెమిస్టర్‌కు 20వేలు ఉంటుంది, డిప్లొమో కోర్సులకు సెమిస్టర్‌కు 16వేల వరకూ ఫీజు ఉంటుంది, కాని అభ్యర్ధులు అందరికీ అటు కేంద్ర ప్రభుత్వమో, ఇటు రాష్ట్ర ప్రభుత్వమో స్కాలర్‌షిప్ రూపంలోనో, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలోనో సాయం అందిస్తాయి. వీరందరికీ చివరి సెమిస్టర్‌లోనే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి కనుక ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో ఫీజు సమస్య కాబోదు.
దీటైన ప్రత్యామ్నాయం సీపెట్
దీటైన ప్రత్యామ్నాయం సీపెట్