బిజినెస్

రికార్డులకు బ్రేక్... నష్టాల్లో ముగిసిన సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 18: గత కొద్ది రోజులుగా కొత్త రికార్డులు సృష్టిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 224 పాయింట్లు పతనం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 9,500 పాయింట్ల దిగువన ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా ఎఫ్‌బిఐ చీఫ్‌ను తొలగించడం ఆయన వ్యాపార అనుకూల అజెండాను నీరు గార్చడమే కాకుండా చివరికి ఆయన అభిశంసనకు సైతం దారి తీయవచ్చన్న భయాల కారణంగా అమెరికా షేర్లు బుధవారం గత ఎనిమిది నెలల్లో ఎన్నడూ లేనంతగా పతనం అయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నిటిపైనా కనిపించింది. ఆసియా మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాల్లోనే కొనసాగాయి. ఫలితంగా సెనె్సక్స్ రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 30, 393.72 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన సూచీ చివరికి దాదాపు224 పాయింట్ల నష్టంతో 30,434.79 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెనె్సక్స్ 470 పాయింట్లకు పైగా లాభపడ్డం తెలిసిందే. నేషనల్ స్టాక్ ఎఖ్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 96.30 పాయింట్లు నష్టపోయి 9,429.45 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా కొనుగోళ్లకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు బుధవారం ఒక్క రోజే రూ.731.39 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు ప్రాథమిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. సెనె్సక్స్‌లోని కంపెనీల్లో టాటా మోటార్స్ 2.55 శాతం మేర పతనం కాగా, యాక్సిస్ బ్యాంక్ సైతం 2.15 శాతం పతనమైంది. బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ ఎం, ఎల్‌అండ్‌టి, హెచ్‌యుఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జిసి, మారుతి సుజుకి, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి, టాటా స్టీల్‌లాంటి ప్రధాన షేర్లన్నీ నష్టపోయాయి. అయితే విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, లుపిన్, సన్‌ఫార్మా, ఏసియన్ పెయింట్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీల నష్టాలు కొంతమేరకు తగ్గాయి.