బిజినెస్

నాలుగు సంస్థలుగా ‘సెస్క్’ విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 18: తన ప్రధాన కంపెనీ అయిన సెస్క్ లిమిటెడ్‌ను నాలుగు కంపెనీలుగా విడగొట్టడం ద్వారా పునర్వ్యవస్థీకరించినట్లు ఆర్‌పి సంజీవ్ గోయంకా గ్రూపు ప్రకటించింది. వివిధ రంగాల కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టడం కోసం సెస్క్ లిమిటెడ్‌ను అత్యంత పారదర్శకమైన రీతిలో నాలుగు కంపెనీలుగా విడగొట్టినట్లు గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయంకా తెలిపారు. గ్రూపునకు చెందిన అన్ని విద్యుత్ పంపిణీ వ్యాపారాలు సెస్క్ లిమిటెడ్ పరిధలోనే ఉంటాయని, ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలన్నీ సెస్క్ జనరేషన్‌లో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే స్పెన్సర్స్‌కు చెందిన రిటైల్ వ్యాపారాలన్నీ ప్రత్యేక కంపెనీగా ఉంటాయని, విద్యుత్, రిటైల్ వ్యాపారాలకు సంబంధించని మిగతా వ్యాపారాలన్నీ కూడా సెస్క్ వెంచర్స్ పరిధిలోకి తీసుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. అక్టోబర్ 1వ తేదీనుంచి ఈ నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతాయని కూడా ఆయన తెలిపారు. మాతృసంస్థ వాటాదారులు నాలుగు విడగొట్టిన కంపెనీల షేర్లను కొనుగోలు చేసినప్పుడు రూ. 66 కోట్ల అదనపువిలువ పొందుతారని కూడా ఆయన తెలిపారు.
జలవాణి కాల్ సెంటర్
ఏపిలో నేడే ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 18: గ్రామాల్లో మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా జలవాణి కాల్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసంలో ఈ కాల్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. కాల్ సెంటర్ నెంబరును అక్కడే ప్రకటించనున్నారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకోనున్నారు.