బిజినెస్

జన్యు మార్పిడి ఆవాల సాగుకు అనుమతిపై త్వరలో సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: జన్యుపరమైన మార్పులు చేసిన ఆవాల వాణిజ్య సాగుకు కేంద్ర జీవసాంకేతిక విజ్ఞాన నియంత్రణ సంస్థ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జిఇఎసి) ఇచ్చిన అనుమతిని కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి సారథ్యంలోని పార్లమెంటరీ స్థారుూ సంఘం సమీక్షించే అవకాశం ఉంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని జిఇఎసి జన్యుపరమైన మార్పులు చేసిన ఆవాల వాణిజ్య సాగుకు సిఫారసు చేసింది. అయితే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే దీనికి సంబంధించి తుది అనుమతి ఇవ్వవలసి ఉంది. అయితే రేణుకా చౌదరి సారథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, అడవుల వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థారుూ సంఘం జన్యు మార్పిడి పంటలు, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని సమీక్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఇప్పటికే అనేకసార్లు చర్చించిన పార్లమెంటరీ స్థారుూ సంఘం ఈ నెలలో సమావేశమై జన్యుమార్పిడి ఆవాల వాణిజ్య సాగుకు జిఇఎసి ఇచ్చిన అనుమతిని సమీక్షించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.