బిజినెస్

టిఎస్‌ఐఐసి ప్రాజెక్టులకు సిండికేట్ బ్యాంక్ రుణసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిఎస్‌ఐఐసి) చేపడుతున్న ప్రాజెక్టులకు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించేందుకు సిండికేట్ బ్యాంక్ యాజమాన్యం ముందుకు వచ్చింది. టిఎస్‌ఐఐసి ద్వారా పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కూడా రుణాలను ఇవ్వడానికి ఈ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండి ఈవి నర్సింహారెడ్డితో సిండికేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సిండికేట్ బ్యాంక్ డిజిఎం ఫలని స్వామి, ఎజిఎం ఆకెళ్ల రవికుమార్, టిఎస్‌ఐఐసి చైర్మన్, ఎండిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిండికేట్ బ్యాంక్ రుణ పథకాలు, విధానాలను బాలమల్లు, నర్సింహారెడ్డికి వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్రను పోషించడానికి సిండికేట్ బ్యాంక్ సిద్ధంగా ఉందని వారు స్పష్టం చేశారు. పరిశ్రమలు స్ధాపించేందుకు ముందుకు వచ్చే వారికి రుణ సదుపాయం కల్పించాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు.

చిత్రం... టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లును
కలుసుకున్న సిండికేట్ బ్యాంకు అధికారులు