బిజినెస్

స్వల్ప లాభాల్లో సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 30.13 పాయింట్లు పెరిగి 30,464.92 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 1.55 పాయింట్లు పడిపోయ 9,427.90 వద్ద నిలిచింది. గురువారం సూచీలు నష్టాలను అందుకున్న నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్ల మధ్య మదుపరులు కాస్త పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఇక ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, టెలికామ్ రంగాల షేర్లు లాభపడగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, ఐటి, ఎనర్జీ, ఆటో, టెక్నాలజీ రంగాల షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
23న బీమా రంగంపై
జాతీయ సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 19: ‘్భరతీయ బీమా రంగంలో విప్లవాత్మక ధోరణులు’ అనే అంశంపై ఈ నెల 23వ తేదీన జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌ట్యాప్సీ డైరెక్టర్ పి వైదేహి తెలిపారు. వ్యక్తిగత బీమా మొదలుకుని పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక, వ్యవసాయ, ఆరోగ్య, ఎగుమతులు, దిగుమతులు, మూల ధన బీమా.. ఇలా అన్ని రంగాల్లో భారతీయ బీమా రంగం దేశ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఏ) ఆఫ్ ఇండియా చైర్మన్ టిఎస్ విజయన్ నేతృత్వంలో జరిగే ఈ జాతీయ సదస్సులో వివిధ బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే వారు ఈ నెల 21లోగా తమ పేర్లన నమోదు చేసుకోవాలని కోరారు.
30న మెడికల్ షాపుల బంద్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 19: ఈ నెల 30న జాతీయ స్థాయిలో మెడికల్ షాపులు బంద్ కానున్నాయ. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కెమిస్టు, డ్రగ్గిస్టుల అసోసియేషన్ ప్రకటించింది. ఈ-పోర్టల్ విధానం ద్వారా మందులను విక్రయించేందకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పోర్టల్ విధానంలో మందులను అమ్మడం వల్ల కొన్ని సాంకేతిక కారణాలతో రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అత్యవసర సమయాల్లో మందులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని అసోసియేషన్ పేర్కొంది.
మా దేశంలో పెట్టుబడులు పెట్టండి
తెలంగాణ పారిశ్రామికవేత్తలకు
వియత్నాం ఆహ్వానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 19: అభివృద్ధి చెందుతున్న వియత్నాం దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను భారత్‌లోని వియత్నాం రాయబారి తన్‌సిన్ థాన్ ఆహ్వనించారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. వియత్నాంలో అపారమైన సహజ సంపద ఉందని, దీనికితోడు పర్యాటక, ఫార్మా, ఐటి, విద్య, కంప్యూటర్ సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు, రాయితీలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత్ నుంచి పెద్ద మొత్తంలో ఫార్మా, రసాయనాలు, జౌళి, వ్యవసాయ ఉత్పత్తులను వియత్నాం దిగుమతి చేసుకుంటుందని గుర్తుచేశారు. నిరుడు ఆరు శాతం వృద్ధి సాధించామని, ఏటా 170 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నామని, 24 బిలియన్ డాలర్లను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా సాధించామని పేర్కొన్నారు. వియత్నాంకు 3 వేల కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, పర్యాటక రంగంలో అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని వివరించారు.