బిజినెస్

దొండకాయలకో మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తొలిసారిగా దొండకాయలకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో బత్తాయిల కోసం మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలోనే దేవరకొండలో దొండకాయల మార్కెట్‌ను తీసుకురా నున్నారు. అలాగే పటాన్‌చెరులో ఉల్లిగడ్డల మార్కెట్‌ను, ఇతర పండ్ల మార్కెట్‌లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో కొత్తగా మరో 34 గోదాములను నిర్మించేందుకు నాబార్డ్ 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. మార్కెటింగ్ శాఖపై మంత్రి శుక్రవారం సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1,024 కోట్ల రూపాయల వ్యయంతో 330 గోదాముల నిర్మాణానికి నాబార్డ్ రుణం మంజూరు చేసింది. 321 గోదాముల నిర్మాణం చేపట్టగా, వీటిలో 20 శాతం కన్నా తక్కువ ధరకు టెండర్లు దాఖలు అయ్యాయి. దీంతో మిగిలిన నిధులకు మరికొన్ని నిధులు ఇవ్వాలని నాబార్డ్‌ను ప్రభుత్వం కోరింది. లక్షా 22,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 34 గోదాములు నిర్మించేందుకు నాబార్డ్ 73.50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరోవైపు ఈ సందర్భంగా ఖమ్మం మిర్చి మార్కెట్‌ను రఘునాథపాలెంకు తరలించే పనులను మంత్రి సమీక్షించారు.