బిజినెస్

ఎస్‌బిఐ లాభం రెండింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కోల్‌కతా, మే 19: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రెండింతలకుపైగా పెరిగింది. మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) ప్రభావం తగ్గుముఖం పట్టడంతో 2,814.82 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 1,263.81 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇదిలావుంటే 2016-17 మొత్తంగా బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 5.36 శాతం పెరిగి 10,484 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16లో ఇది 9,951 కోట్ల రూపాయలకే పరిమితమైంది. అయితే బ్యాంక్ ఏకీకృత నికర లాభం 2016-17లో దాదాపు 98 శాతం క్షీణించి 241.23 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16లో ఇది 12,224.59 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈ జనవరి-మార్చిలో 57,720 కోట్ల రూపాయలుగా, నిరుడు 53,526.97 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ఆదాయం 2,98,640.45 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2,73,461.13 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం కోల్‌కతాలో బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు.