బిజినెస్

దేశం విడిచివెళ్లిన కార్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సిబిఐ దాడులు జరిగిన రెండు రోజుల తరువాత లండన్ వెళ్లటం వివాదాస్పదంగా తయారైంది. సిబిఐ దాడులతో పాటు ఆదాయం పన్ను (ఐటి) శాఖ నిధుల దుర్వినియోగం కేసులు పెట్టటంతో చిదంబరం లండన్ పారిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే చిదంబరం మాత్రం ఈ వార్తలను ఖండించారు. కార్తి చిదంబరం ముం దు నిర్ణయించిన ప్రకారమే లండన్ వెళ్లారని, ఆయన అక్కడ కొన్ని రోజులు ఉండి తన పని పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి వస్తారని చిదంబర చెబుతున్నారు. కార్తి చిదంబరం విదేశాలకు వెళ్లకూడదనే నిషేధాజ్ఞలేవీ అమలులో లేవు కదా అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. అయితే సిబిఐ, ఆదాయం పన్ను శాఖతో పాటు ఇతర నిఘా సంస్థలు మాత్రం చిదంబరం అభిప్రాయంతో ఏకీభవించటం లేదు. కార్తి చిదంబరం దేశం విడిచిపోయారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. కార్తి చిదంబర వారం, పది రోజుల్లో స్వదేశానికి తిరిగి రాకపోతే దేశం విడిచిపారిపోయినట్లు ప్రకటించటంతో పాటు ఆయనను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసి ఉంటుందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. కార్తి చిదంబరం విదేశీ ప్రయాణం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని నిఘా సంస్థలు చెబుతున్నాయి. సిబిఐ ఈ నెల 17, 18 తేదీల్లో కార్తి చిదంబరం, ఆయనకు సంబంధం ఉన్న కొన్ని సంస్థలకు చెందిన చెన్నై, ఢిల్లీ, గురుగాంవ్, హైదరాబాద్, మరికొన్ని నగరాల్లోని నివాసాలపై దాడులు చేయటం తెలిసిందే. ఈ దాడుల్లో అక్రమ సంపాదనకు సంబంధించిన పలు పత్రాలు సిబిఐ చేతికి అందినట్లు చెబుతున్నారు. కార్తి చిదంబరంకు విదేశాల్లో కూడా బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు ఉన్నట్లు సిబిఐ దాడుల్లో వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగానే ఆదాయం పన్ను శాఖ ఆయనకు మనీలాండరింగ్ ఆరోపణలతో నోటీసులు జారీ చేసింది. పలు విదేశాల్లో ఆయనకు స్థిరాస్తులు ఉన్నాయంటే మనీ లాండరింగ్ జరిగినట్లేనని ఆదాయం పన్ను శాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
మనీలాండరింగ్ కేసు నమోదు
ఇదిలా ఉండగా, సిబిఐ ఇటీవల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్తి చిదంబరం, మరికొందరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కార్తి, ఐఎన్‌ఎక్స్ మీడియా, ఆ సంస్థ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాని ముఖర్జీ, మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని నిబంధనల కింద ఇసిఐఆర్ నమోదు చేసినట్లు వారు చెప్పారు.