బిజినెస్

చైనా కరెన్సీ పతనంతో కుప్పకూలిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 7: ఆర్థిక వృద్ధి మందగమనాన్ని తట్టుకోవడం కోసం చైనా తన కరెన్సీ యువాన్ వేగంగా పడిపోవడానికి అనుమతించడంతో అంతర్జాతీయ స్టాక్, కరెన్సీ మార్కెట్లన్నీ అమ్మకాల ఓత్తిడితో కొట్టుమిట్టాడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం భారీగా పతనమైనాయి. అన్ని రంగాల షేర్లలో భారీ ఎత్తున అమ్మకాల కారణంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 550 పాయింట్లు పడిపోయి 19 నెలల కనిష్టస్థాయి అయిన 24,851.83 పాయింట్లకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 173 పాయింట్లు పడిపోయి 7,600 పాయింట్ల దిగువకు చేరింది. ప్రధానంగా రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. విద్యుత్, పిఎస్‌యు, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లన్నీ కూడా అమ్మకాల ఒత్తిడికి గురయిన నేపథ్యంలో గురువారం ఉదయం బలహీనంగా ప్రారంభమైన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఫలితంగా 554.50 పాయింట్లు నష్టపోయి 24,851.83 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 జూన్ 4 తర్వాత సెనె్సక్స్ ఇంత తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి. నాలుగు రోజుల్లో సెనె్సక్స్ 1309 పాయింట్లకు పైగా నష్టపోయింది.
ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ కూడా భారీగానే పతనమైనాయి. షాంఘై స్టాక్ మార్కెట్లో షేర్లు 7.23 శాతం పతనం కావడంతో ప్రారంభమైన అరగంటకే ట్రేడింగ్‌ను నిలిపివేసారు. కాగా, చైనా కేంద్ర బ్యాంక్ గురువారం డాలరుతో యువాన్ విలువను అరశాతానికి పైగా తగ్గించింది. 2011 తర్వాత చైనా కరెన్సీ ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. కాగా, 7600 పాయింట్ల దిగువకు చేరుకున్న తర్వాత నిఫ్టీ ఒక దశలో 7,556.60 పాయింట్ల కనిష్టస్థాయిని తాకి చివరికి 172.70 పాయింట్ల నష్టంతో 7,568.30 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లూ నష్టపోగా బిహెచ్‌ఇఎల్ (6.98 శాతం), టాటా స్టీల్ (6.85 శాతం), టాటా మోటార్స్ (6.15 శాతం) ముందువరసలో ఉన్నాయి. అమ్మకాల ఒత్తిడితో యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ, అదానీ పోర్ట్స్, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్‌టిపిసి,హీరో మోటోకార్ప్. ఎంఅండ్‌ఎం, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, లుపిన్, సిప్లా, రిలయెన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్, ఐటిసిలాంటి ప్రధాన షేర్లన్నీ కూడా 4.98 శాతం దాకా పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో ఒక దశలో డాలరుతో రూపాయి రెండు వారాల కనిష్టస్థాయి 66.90 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 12 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బ తీసింది. ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ కూడా భారీ నష్టాలతో ముగిసాయి.
రేపు బిఎస్‌ఇలో మాక్ ట్రేడింగ్ సెషన్
ఇదిలా ఉండగా, ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుందో పరీక్షించి చూడడం కోసం బిఎస్‌ఇ శనివారం మాక్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించబోతోంది. ఆల్గోరిథమ్ మార్పులకు గురయిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆల్గోరిథమిక్ ట్రేడింగ్‌లో పాల్గొనడం కోసం ఇందుకోసం ఆమోదించిన యూజర్ ఐడి కార్డులతో రావాలని బిఎస్‌ఇ ట్రేడింగ్ సభ్యులందరినీ కోరింది.