బిజినెస్

సేవా పన్ను చెల్లించకుంటే జైలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: విశాఖలో సేవా పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖలో వివిధ రకాల పరిశ్రమలతోపాటు, స్టార్ హోటల్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటి నుంచి సేవా పన్ను వేల కోట్ల రూపాయల్లో వసూలు అవుతోంది. సాధారణంగా కస్టమ్స్ విభాగంతో సంబంధాలు ఉన్న షిప్పింగ్ కంపెనీల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం చాలా సులువు. ఇందులో అంతగా పన్ను ఎగవేతదారులు ఉండకపోవచ్చు. కానీ మిగిలిన కంపెనీలు, హోటల్స్ సేవా పన్ను ఎగవేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
కొద్ది రోజుల కిందట విశాఖలోని ఓ త్రీ స్టార్ హోటల్ సుమారు మూడు కోట్ల రూపాయల సేవా పన్ను ఎగవేయడంతో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడిచేసి సంబంధిత యజమానిని జైలుకు పంపించారు. ఇదే తరహాలో మరికొన్ని హోటల్స్, పరిశ్రమలు ఉన్నాయి. ఆయా వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యాపారి కొంతమేర వరకు సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించకపోయినా సెంట్రల్ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చి, ఆయా మొత్తాలను రాబడుతూ వస్తోంది. కానీ జూలై ఒకటో తేదీ నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తోంది. ఆ తరువాత పన్ను ఎగవేతదారుల నుంచి బకాయిలు వసూలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు, పన్ను ఎగవేతదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
వీరికి నోటీసులు కూడా పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. జూన్ నెలాఖరులోగా బకాయిలు వసూలు చేయాలన్న లక్ష్యంతో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ పనిచేస్తోంది. దీంతో మొండి బకాయదారులను జైలుకు పంపించేం దుకూ వెనుకాడకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.