బిజినెస్

రెండోరోజూ నష్టాల్లోనే మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 63.61 పాయింట్లు దిగజారి 30,301.64 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25.60 పాయింట్లు కోల్పోయి 9,360.55 వద్ద నిలిచింది. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.
మంగళవారం కూడా సూచీలు నష్టపోయినది తెలిసిందే. ఇకపోతే బుధవారం ట్రేడింగ్‌లో క్యాపిటల్ గూడ్స్, మెటల్, హెల్త్‌కేర్, రియల్టీ రంగాల షేర్ల విలువ 2.62 శాతం నుంచి 1.87 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.
27 వరకు బిఎస్‌ఎన్‌ఎల్ మెగా మేళా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) ఈ నెల 25 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్ల పరిధిలో మెగా మేళాను నిర్వహిస్తోందని సంస్థ టెలికామ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ తెలిపారు. ఈ మెగా మేళాలో వినియోదారులు ఉచిత 3జి స్మార్ట్ సిమ్‌లను కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంచైజ్, రిటేల్ ఔట్‌లెట్, రోడ్ షోలలో పొందవచ్చు.
కొత్త వినియోదారులు 310 ఎంబి ఉచిత డేటా పొందవచ్చు. వినియోగదారులు ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బాండ్, ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్లనూ పొందవచ్చు. కస్టమర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా అనంతరామ్ కోరారు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నెంబర్‌కు డయల్ చేసి సంప్రదించగలరని తెలిపారు.