బిజినెస్

పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిపాజిట్లపై క్యాష్‌బ్యాక్, 4 శాతం వడ్డీరేటు ఆఫర్ ౄ ఉచితంగానే అన్ని ఆన్‌లైన్ లావాదేవీలు
ఖాతాల్లో కనీస నగదు నిల్వలు అక్కర్లేదని ప్రకటన ౄ 2020 నాటికి 50 కోట్ల కస్టమర్లుండాలన్నదే లక్ష్యం

న్యూఢిల్లీ, మే 23: చైనాకు చెందిన అలీబాబా సంస్థ సారథ్యంలోని పేటిఎమ్.. మంగళవారం దేశీయంగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా 2020 నాటికి 50 కోట్ల కస్టమర్లను అందుకోవాలన్న లక్ష్యంలో భాగంగా డిపాజిట్లపై 4 శాతం వడ్డీరేటుతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
అలీబాబాతోపాటు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ నిధులతో నడుస్తున్న ఈ భారతీయ అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్.. ఖాతాదారులకు ఖాతాల్లో ఎలాంటి కనీస నగదు నిబంధనలను విధించలేదు. ఖాతా నిర్వహణకు మినిమం బ్యాలెన్స్‌తో పనిలేదని స్పష్టం చేసింది. అలాగే అన్ని ఆన్‌లైన్ లావాదేవీలు కూడా ఉచితమని చెప్పింది. వ్యాపారులకు కరెంట్ అకౌంట్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు తెలిపింది.
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనలో భాగంగా నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంచలనాత్మక నిర్ణయం పాత పెద్ద నోట్ల రద్దుతో పేటిఎమ్ సేవలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ తెలిపినది తెలిసిందే. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త 500, 2,000 రూపాయల నోట్లను, ఇతరత్రా చిన్న నోట్లను పొందవచ్చని కూడా సూచించారు.
అయితే నగదు కొరత, ముఖ్యంగా 500 రూపాయల నోట్ల సరఫరా లేకపోవడం, 2,000 రూపాయల నోట్ల చలామణినే ఉండటంతో చిల్లర కష్టాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించేందుకు మోదీ సర్కారు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించగా, పేటిఎమ్ సేవలు విస్తృతమయ్యాయి. ఎలక్ట్రానిక్ వాలెట్‌గా ఇప్పటికీ పేటిఎమ్ అందిస్తున్న సేవలను దేశవ్యాప్తంగా చాలామంది వినియోగించుకుంటున్నారు. వీరి సంఖ్య 22 కోట్లుగా ఉంటుందని పేటిఎమ్ చెబుతోంది.
ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కు పెట్టుకున్న పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రావడంతో అందులోకి అడుగిడింది పేటిఎమ్. ఇందులోభాగంగానే రాబోయే రెండేళ్ల కోసం బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరణకుగాను 400 కోట్ల రూపాయలను పేటిఎమ్ పెట్టుబడిగా పెట్టనుంది. తొలి ఏడాది 3 వేల కస్టమర్ పాయింట్లను, 31 శాఖలను తెరవనుంది. ఇదిలావుంటే భారతీ ఎయిర్‌టెల్, భారతీయ తపాలా శాఖల తర్వాత పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తెస్తున్నది పేటిఎమ్‌నే. నిజానికి 2015లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌సహా 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఆరంభించేందుకు ఆర్‌బిఐ అనుమతినిచ్చింది. అయితే వీటిలో ఆదిత్యా బిర్లా తదితర సంస్థలు విరమించుకున్నాయి. పేమెంట్స్ బ్యాంకులు డిపాజిట్లను, రెమిటెన్స్‌లను తీసుకోవచ్చు. కానీ రుణాలివ్వరాదు. ‘ఓ కొత్త రకం బ్యాంకింగ్ విధానంలో భాగస్వాములయ్యేందుకు ఆర్‌బిఐ మాకు అవకాశం కల్పించింది. అందుకు మేము గర్విస్తున్నాం. మా కస్టమర్ల డిపాజిట్లకు పూర్తి భద్రతను ఇస్తాం. ఇబ్బందికర, ఆందోళనకర మార్గాల్లోకి వీటిని మళ్లించం. ప్రభుత్వ బాండ్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడతాం.’ అని పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఓ ప్రకటనలో చెప్పారు.
ప్రస్తుతం తమ డిజిటల్ వాలెట్‌ను వినియోగించుకుంటున్న దాదాపు 22 కోట్ల కస్టమర్లు పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులుగా మారవచ్చని, అయితే ఖాతాలు తెరవడానికి నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలను పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కెవైసి సెంటర్లను ఏర్పాటుచేస్తామని, వాటి ద్వారా ఖాతాలను సులభంగా తెరుచుకోవచ్చని, 2020 నాటికి 50 కోట్ల కస్టమర్లు తమ ఖాతాదారులు కావాలన్నదే లక్ష్యమని పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సిఇఒ రేణు సత్తి తెలిపారు. తొలి విడతలో భాగంగా తమ బేటా బ్యాంకింగ్ యాప్‌ను తమ ఉద్యోగులందరికీ, అసోసియేట్లకు అందిస్తామని చెప్పారు.
ఇప్పటికిప్పుడు ఖాతాలు కావాలనుకున్న పేటిఎమ్ కస్టమర్లు యాపిల్ ఐఒఎస్ వేదికపై పేటిఎమ్ దరఖాస్తులు లేదా పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఓ ఆహ్వాన విజ్ఞప్తి చేసి పొందవచ్చని స్పష్టం చేశారు. 25,000 రూపాయల డిపాజిట్‌పై ప్రతీ కస్టమర్‌కు 250 రూపాయల క్యాష్‌బ్యాక్ వస్తుందన్నారు. జీరో బ్యాలెన్స్‌తోనే ఖాతాలు నడుస్తాయని, ఐఎమ్‌పిఎస్, ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ తదితర ప్రతీ ఆన్‌లైన్ లావాదేవీ ఉచితమేనని పేర్కొన్నారు. డిపాజిట్లపై ఏటా 4 శాతం వడ్డీరేటును ఇస్తామని చెప్పారు. రూపే డెబిట్ కార్డులను కస్టమర్లకు తక్షణమే ఇస్తామన్న పేటిఎమ్.. దేశంలోని ఏ ఎటిఎమ్ నుంచైనా నగదు ఉపసంహరణకుగాను విజ్ఞప్తిపై ఫిజికల్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పింది.