బిజినెస్

క్షీణించిన సిక్కా వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌కు సారథిగా వ్యవహరిస్తున్న విశాల్ సిక్కా వేతనం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 67 శాతం క్షీణించింది. తక్కువ బోనస్ చెల్లింపుల వల్లే ఈ పతనం చోటుచేసుకుంది. సిక్కా వేతనంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినది తెలిసిందే. సంస్థలో ఉన్నతోద్యోగుల జీతాలు సగటు ఉద్యోగిలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో 2015-16తో పోల్చితే సిక్కా వేతనం 48.73 కోట్ల రూపాయల నుంచి 16.01 కోట్ల రూపాయలకు పడిపోయింది.

‘బలవంతంగా భూములు తీసుకోం’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: హైదరాబాద్ శివార్లలో రానున్న ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోబోమని, స్వచ్చంధంగా ముందుకు వచ్చిన రైతులకు సహేతుక పరిహారం చెల్లిస్తామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు చెప్పారు. ఫార్మాసిటీ కోసం భూ నిర్వాసిత రైతులతో ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ప్రయోజనాలను ఆయన రైతులకు వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం రైతులకు సొమ్ము చెల్లిస్తామన్నారు. ఫార్మాసిటీ కోసం ఇంతవరకు 6,166 ఎకరాలను సేకరించామన్నారు.