బిజినెస్

నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఐడిబిఐ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 5: ఏడాదికేడాది నష్టాలు పెరిగిపోతుండడం, తన అసెట్‌ల నాణ్యత సైతం దిగజారిపోతుండడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడిబిఐ తన మూలధనాన్ని పెంచుకోవడంతో పాటుగా మొండి బకాయిల రికవరీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరిగి లాభాల బాటలో పయనించడం కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకుంది. మా మూలధనం బేస్‌ను మెరుగుపర్చుకోవడానికి, అలాగే తిరిగి రికవరీ బాటలో బ్యాంక్‌ను నడిపించడానికి అన్ని మార్గాలను చూస్తున్నామని బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓగా నియమితుడయిన మహేశ్ కుమార్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 2016 ఆర్థిక సంవత్సరంలో ఐడిబిఐ నికర నష్టాలు రూ.3,665 కోట్లు ఉండగా, 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి అవి రూ. 5,158 కోట్లకు చేరుకున్నాయి. కాగా, క్రితం సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దాని నిరర్థక ఆస్తులు సైతం దాదాపు రెట్టింపయి 21.25 శాతానికి చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలస్తే గత ఆర్థిక సంవత్సరంలో దాని నికర ఎన్‌పిఏలు 6.78 శాతంనుంచి 13.21 శాతానికి పెరిగి పోయాయి. రాబోయే రోజుల్లో నిర్వహణ ఖర్చులను తగ్గంచుకోవడంతో పాటు అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని బ్యాంక్ యోచిస్తోందని జైన్ చెప్పారు. అంతేకాదు భారీ ఎత్తున బకాయిల వసూలుతో పాటుగా ఖర్చులను తగ్గించుకోవాలని, అలాగే కార్పొరేట్ రుణాల వాటాలను రిస్క్ ఎక్కువగా ఉండే ఆస్తులను తగ్గించుకోవాలని కూడా యోచిస్తున్నామని, దీనివల్ల మూలధనంపై ఒత్తిడి తగ్గుతుందని కూడా ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ మూడీస్ ఐడిబిఐ బ్యాంక్ రేటింగ్‌ను గురువారం ‘బిఏ2’నుంచి ‘బిఏఏ3’కి తగ్గించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందనేదానికి దాని రేటింగ్ తగ్గింపు నిదర్శనమని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
టాటా టెలీలో డొకోమో వాటా
కొనుగోలుకు సిసిఐ ఆమోదం
న్యూఢిల్లీ, మే 25: టాటా టెలీ సర్వీసెస్‌లోని జపాన్‌కు చెందిన ఎన్‌టిటి డొకోమోకు చెందిన 21.63 శాతం వాటాను టాటాలు కొనుగోలు చేయడానికి ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ అయిన సిసిఐ ఆమోదం తెలియజేసింది. దీంతో దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన వందలకోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఒక ముగింపునకు రావడానికి మార్గం మరింత సుగమమైంది. టాటా టెలీ సర్వీసెస్‌లోని డొకోమోకు చెందిన 21.63 శాతం కొనుగోలు చేయడానికి టాటా సన్స్‌తో పాటుగా ఆ గ్రూపులోని మరో నాలుగు కంపెనీలు టాటా స్టీల్, టాటా ఇండస్ట్రీస్, టాటా కమ్యూనికేషన్స, టాటా పవర్‌లు కలిసి సిసిఐకి ఒక జాయింట్ అభ్యర్థనను దాఖలు చేశాయి. దీనివల్ల దేశంలో టెలీకమ్యూనికేషన్స్ రంగం పరిస్థితిలో ఎలాంటి మార్పులూ రావని కూడా ఆ కంపెనీలు సిసిఐముందు దాఖలు చేసిన అభ్యర్థనలో ఆ కంపెనీలు తెలిపాయి. అంతేకాక దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి డొకోమోకు 1.18 బిలియన్ డాలర్లు చెల్లించడానికి కూడా టాటా సన్స్ సిసిఐ, పన్ను విభాగం అధికారుల అనుమతిని కూడా కోరింది.
సెపరేషన్ ప్యాకేజీ
ఐచ్ఛికమే
ఉద్యోగులకు కాగ్నిజంట్ వివరణ
బెంగళూరు, మే 25: ఐటి రంగంలోని మిగతా కంపెనీలు తమ ఉద్యోగులకు రెగ్యులర్‌గా సెపరేషన్ ప్యాకేజిలను అమలు చేస్తుంటే తాము మాత్రం మొట్టమొదటిసారిగా భారత్, అమెరికాలలో ఈ ఉద్యోగి సెపరేషన్ ప్యాకేజిని అమలు చేస్తున్నామని అంతర్జాతీయ ఐటి దిగ్గజం కాగ్నిజంట్ ప్రకటించింది. కాగ్నిజంట్ తమ కంపెనీలో పని చేస్తున్న డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు 6-9 నెలల వేతనాలు ఆఫర్ చేస్తూ స్వచ్ఛంద సెపరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొత్తగా ఏర్పాటయిన ఐటి వర్కర్ల యూనియన్ చెన్నై, హైదరాబాద్, పుణెలలోని లేబర్ కమిషనర్లను ఆశ్రయించడంతో పాటుగా కంపెనీలో జరుగుతున్న అక్రమ ఉద్యోగుల తొలగింపును ఆపాలని కోరడం తెలిసిందే. తమ తోటి కంపెనీలు రెగ్యులర్‌గా తమ కంపెనీలకు ఇలాంటి సెపరేషన్ ప్యాకేజిలను ప్రకటిస్తుండగా, కాగ్నిజంట్ లో తాము ఇలా చేయడం ఇదే మొదటిసారని తమ ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా పేర్కొన్నారు. ఈ ప్యాకేజిలో పాల్గొనే వారు ఇతర అవకాశాలను వెతుక్కోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా కొత్త తరం లీడర్లు తమ స్థానంలో అడుగుపెట్టడానికి ఈ పథకం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ఇది స్వచ్ఛందమని ఈ పథకమే చెప్తోందని, ఇందులో పాలు పంచుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయడం కానీ,కోరడం కానీ జరగదని, సంస్థలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే వారికి, అలాగే తమ కెరీర్‌లో మార్పు కోరుకునే వారికి ఇది మేలు చేస్తుందని తాము గట్టిగా నమ్ముతున్నామని మెహతా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.