బిజినెస్

బెల్టుషాపులు క్లీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 25: నవ్యాంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్ట్ దుకాణాలు క్లీన్ చేసేందుకు రాష్ట్ర అబ్కారీశాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పాటూరి లక్ష్మీనృసింహం నడుం బిగించారు. ఈ అంశం ఇటు మద్యం వ్యాపారులు, అటు రాజకీయ వర్గాలు, మరోవైపు ఎక్సైజ్ అధికారులను ఒక కుదుపుకుదిపేస్తోంది. కొత్త అబ్కారీ విధానంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు చేసేలా నిర్ణయం తీసుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరంభమైన దాడుల్లో భాగంగానే బుధ, గురువారాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి బెల్ట్ షాపులు పీకేసే పని ప్రారంభమైంది. ఇందుకు ప్రత్యేక కమిషనర్ ఆదేశాలతో అదనంగా ఎక్సైజ్ బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 742 బెల్ట్ దుకాణాలకు తాళాలు వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎచ్చెర్ల మండలం అజ్జరాం, దోమం, డి.మత్స్యలేశం, పూడివలస, తమ్మినాయుడుపేట, తోటపాలెం గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలపై దాడులు జరిగాయి. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలా రాష్టమ్రంతటా లక్షలాది బెల్ట్ దుకాణాలకు తాళాలు వేసేందుకు ప్రత్యేక కమిషనర్ వ్యూహం రచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త అబ్కారీ విధానంలో రాష్టమ్రంతటా మద్యం ధర ఒకేవిధంగా ఉండేలా లక్ష్మీనృసింహం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ జరిగిన విధానాలు, ముడుపులు, లంచాలు, నెలవారీ మామూళ్ల సాంప్రదాయాలను పూర్తిగా క్లీన్ చేసేందుకు ప్రత్యేక అధికారులతో బెల్ట్ తీయడం, ఎమ్మార్పీ అమలు చేయడంపై మిషన్-అబ్కారీ మొదలైంది. శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన పాటూరి లక్ష్మీనృసింహంను ఇటీవల ప్రభుత్వం అబ్కారీశాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. కలెక్టర్‌గా ఉన్న రోజుల్లో ప్రతీ గ్రామంలో మద్యానికి దూరంగా ఉండాలని స్థానికులకు కౌనె్సలింగ్ నిర్వహించిన లక్ష్మీనృసింహం ఎక్సయిజ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బెల్ట్ షాపులు మూసివేతే లక్ష్యంగా ఇప్పుడు కసరత్తు మొదలెట్టారు. ప్రతి జిల్లాలో రెండుమూడు ప్రత్యేక బృందాలు బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నిల్వలు, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం ఎక్సయిజ్‌శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. మద్యం దుకాణాలకు అనుసంధానంగా గొలుసు దుకాణాలు నిర్వహించుకునేందుకు ప్రతీ నెలా మద్యం వ్యాపారులు ఎక్సయిజ్, పోలీస్ అధికారులకు ముడుపులు చెల్లించడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో జూలై ఒకటి నుంచి కొత్త విధానంలో దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ తరుణంలో నెల రోజుల వ్యవధిలో షాపులు వదులుకునే మద్యం వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మూలాలుగా ఉన్న బెల్ట్ షాపులను మూయించేందుకు సాక్షాత్తు ఆ శాఖ ప్రత్యేక కమిషనరే రంగంలోకి దిగడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు హడలెత్తిపోతున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సుమారు 172 బెల్ట్ షాపులను సీజ్ చేసి, వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేసారు. స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల జోక్యం లేకుండా ప్రత్యేక బృందాలు నేరుగా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ హల్‌చల్ చేయడంతో సంబంధిత నియోజకవర్గం ఎమ్మెల్యేల సిఫారసులు కూడా చెల్లుబాటు కాలేదు. ఇటువంటి పరిస్థితులపై ప్రజాప్రతినిధులు నిలదీసినప్పటికీ, అబ్కారీ అధికారులు మాత్రం బెల్టుషాపులపై ప్రత్యేక బృందాల దాడుల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ ప్రత్యేక వ్యూహాన్ని నడుపుతున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా మిగిలిన 12 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మద్యం దుకాణాలపై దాడులను నిరసిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. దీనిపై సిఎం సానుకూలంగా స్పందిస్తూనే కొన్నాళ్లపాటు వేచిచూసి..లక్ష్మీనృసింహం బదిలీకి రంగం సిద్ధం చేద్దామని మద్యం వ్యాపారంతో సంబంధం గల కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం.

అబ్కారీ శాఖ ప్రత్యేక కమిషనర్
డాక్టర్ లక్ష్మీనృసింహం