బిజినెస్

ఒకరోజు వేతనం రూ. 2.18 లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.85 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది దాదాపు 64 శాతం అధికం. ఇకపోతే నిరుడు కొచ్చర్ రోజువారి వేతనం 2.18 లక్షల రూపాయలుగా తేలింది. 2016-17కుగాను బేసిక్ సాలరీ కూడా గతంతో పోల్చితే 15 శాతానికిపైగా పెరిగింది. 2.67 కోట్ల రూపాయలకు చేరింది. 2015-16లో 2.32 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో బోనస్‌లు, ఇతరత్రా అలవెన్సులు కాకుండా కేవలం సాలరీ ఆధారంగా చూస్తే కొచ్చర్ నెలసరి వేతనం 20 లక్షల రూపాయలకుపైగా ఉందన్నమాట. మరో 2.2 కోట్ల రూపాయలను పనితీరు ఆధారంగా బోనస్ రూపంలో కొచ్చర్ అందుకున్నారు. ఇళ్లు, గ్యాస్, విద్యుత్, నీరు, క్లబ్ ఫీజులు, గ్రూప్ బీమా, కారు, టెలిఫోన్ అవసరాలకు చేసే ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ కూడా బ్యాంక్.. కొచ్చర్‌కు అందిస్తుంది. ప్రయాణ ఖర్చుల్లో రాయతీ, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా లభించింది. ఇదిలావుంటే వృద్ధికి ఆస్కారమున్న రంగాలపై పెట్టుబడులు పెట్టడానికి ఐసిఐసిఐ బ్యాంక్ కృషి చేస్తోందని చందా కొచ్చర్ ఒక సందేశంలో పేర్కొన్నారు. బ్యాంక్‌కు ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించేందుకూ సమర్థవంతంగా పోరాడుతామని చెప్పారు. మార్కెట్‌లో అగ్రస్థానాన్ని అందుకునేందుకు అన్ని విధాలా శ్రమిస్తామని స్పష్టం చేశారు.