బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాటా కెమికల్స్
న్యూఢిల్లీ, మే 26: టాటా కెమికల్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 343.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 260.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,079.47 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,618.14 కోట్ల రూపాయలు గా ఉందని సంస్థ తెలియజేసింది.
కంటైనర్ కార్పొరేషన్
కంటైనర్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 335.71 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 306.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 1,617.15 కోట్ల రూపాయలుగా, పోయనసారి 1,663.55 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
సన్ టివి నెట్‌వర్క్
సన్ టివి నెట్‌వర్క్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 235.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 235.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 619.85 కోట్ల రూపాయలుగా, నిరుడు 593.80 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.
ఎంఫసిస్
ఐటి రంగ సంస్థ ఎంఫసిస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 184.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 156.5 కోట్ల రూపాయలని పేర్కొంది. ఆదాయం ఈసారి 1,473.2 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,516.7 కోట్ల రూపాయలుగా ఉందని ఎంఫసిస్ చెప్పింది.
ఎన్‌బిసిసి ఇండియా
ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బిసిసి ఇండియా ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 173.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే 39 శాతం పెరిగింది. ఆదాయం ఈసారి 2,377 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,326 కోట్ల రూపాయలుగా ఉంది.