బిజినెస్

సెనె్సక్స్ @31,028

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత
ఆల్‌టైమ్ హైకి చేరిన సూచీలు ౄ 9,595 వద్ద నిఫ్టీ

ముంబయి, మే 26: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదుపరులు కొనుగోళ్ల జోరుతో పరుగులు పెడుతున్నారు. దీంతో సూచీలు కూడా మునుపెన్నడూ లేనివిధంగా రికార్డులతో దౌడు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 278.18 పాయింట్లు పెరిగి 31,028.21 వద్ద ఇంతకుముందెప్పుడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హై స్థాయిలో ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.35 పాయింట్లు అందుకుని తొలిసారిగా 9,595.10 వద్ద నిలిచింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 31,074.07 పాయింట్లు, నిఫ్టీ 9,604.90 పాయింట్ల స్థాయిని తాకాయి. దీంతో నూతన ఇంట్రా-డే రికార్డులు నమోదయ్యాయి. గురువారం కూడా సూచీలు భారీ లాభాలను పొందినది తెలిసిందే. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 563.29 పాయింట్లు, నిఫ్టీ 167.20 పాయింట్లు పెరిగితే, సూచీలు లాభపడటం వరుసగా ఇది మూడో వారం. కాగా, 2014 మే నెలలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సెనె్సక్స్ 25.53 శాతం , నిఫ్టీ 30.38 శాతం లాభపడింది. ఇదిలావుంటే దేశీయ, విదేశీ మదుపరులు నిలకడగా పెట్టుబడులను పెడుతుండటంతో స్టాక్ మార్కెట్లు ఇటీవలికాలంలో తరచూ నూతన స్థాయిలను అధిరోహిస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో మెటల్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ రంగాల షేర్ల విలువ 3.40 శాతం నుంచి 0.78 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో కీలకమైన హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, జపాన్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ సూచీ లు నష్టపోగా, బ్రిటన్ సూచీ లాభపడింది.
50 లక్షల కోట్లు పెరిగిన
మదుపరుల సంపద
న్యూఢిల్లీ: మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. గడచిన మూడేళ్లలో టాటా, బిర్లా, అంబానీ, బజాజ్, అదానీ, హెచ్‌డిఎఫ్‌సి, హిందుజా, ఎల్‌అండ్‌టి, వేదాంత, ఐసిఐసిఐ, గోద్రెజ్, అడాగ్, ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్ర గ్రూప్ సంస్థల షేర్ల విలువ అత్యధికంగా పుంజుకుంది. ముఖ్యంగా టాటా, బిర్లా, అంబానీ, బజాజ్ గ్రూప్‌ల్లోని సంస్థల షేర్ల విలువ ఈ మూడేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయలకుపైగానే పెరిగింది. ప్రభుత్వరంగ సంస్థల షేర్లూ సుమారు 22 శాతం ఎగబాకి 3.65 లక్షల కోట్ల రూపాయల విలువను పెంచుకున్నాయి. 2014 మే నెలలో ఎన్‌డిఎ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది తెలిసిందే. దీంతో నాడు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, నేడు 125 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. శుక్రవారం 1,25,63,952 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. బిఎస్‌ఇలో దాదాపు 2,800 సంస్థలు ట్రేడ్ అవుతున్నాయ. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన గత మూడేళ్ల నుంచి బిఎస్‌ఇ ప్రధాన సూచీ అయన సెనె్సక్స్ 6,311.33 పాయంట్లు పెరిగింది. కాగా, సెనె్సక్స్ సంస్థల మార్కెట్ విలువలో టాటా గ్రూప్‌లోని టిసిఎస్ ఒక్కదాని మార్కెట్ విలువే 92,000 కోట్ల రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. ప్రస్తుతం 5,08,232.48 కోట్ల రూపాయల వద్ద కదలాడుతోంది. అలాగే ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ విలువ సైతం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఎగిసింది. ఇప్పుడిది 4,34,326.63 కోట్ల రూపాయల వద్ద ఉంది. అదానీ గ్రూప్ 1.1 లక్షల కోట్ల రూపాయలు, బిర్లా గ్రూప్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు, బజాజ్ గ్రూప్ 1.7 లక్షల కోట్ల రూపాయలు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ 3 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువను పెంచుకున్నాయి. వేదాంత 75,000 కోట్ల రూపాయలు, ఎల్‌అండ్‌టి 60,000 కోట్ల రూపాయలు, గోద్రెజ్ 50,000 కోట్ల రూపాయలు, మహీంద్రా సంస్థల విలువ 35,000 కోట్ల రూపాయలు పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ 4,16,977.28 కోట్ల రూపాయలుగా, ఐటిసి మార్కెట్ విలువ 3,74,928.98 కోట్ల రూపాయలుగా, హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ 2,45,933.42 కోట్ల రూపాయలుగా ఉంది.