బిజినెస్

చేతివృత్తుల వారికి ‘చేయూత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: చేతి వృత్తుల వారికి చేయూతనిస్తున్నామని తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి, ఖాదీ బోర్డు చైర్మన్ మహ్మద్ యూసుఫ్ జాహెద్ తెలిపారు. శనివారం తెలంగాణ జిల్లాల ప్రాంతీయ అధికారులకు తెలంగాణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి, బోర్డు కార్యాలయంలో సంప్రదాయ పరిశ్రమలపై వర్క్ షాప్ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ జిల్లాలలో అమలు చేయడం గురించి వారికి అవగాహన కల్పించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి, హుమాయున్‌నగర్, హైదరాబాద్ బోర్డు ఆవిర్భావం నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చేతి వృత్తుల వారికి, సంప్రదాయ చేతి వృత్తుల వారైన కుమ్మరి, వడ్రంగి, మంగలి, విస్తర్ల తయారీదారులకు, అగరబత్తి, కొవ్వొత్తులు, టైలరింగ్, వెల్డింగ్ వర్క్ షాప్‌లకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, ప్రత్యేక రుణాల ను మంజూరు చేస్తున్నట్లు చైర్మన్ వివరించారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజి ద్వారా అమలు చేస్తున్నామని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.