బిజినెస్

విదేశీ మదుపరుల దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. 2016లో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గత ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ సంవత్సరం జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. తర్వాతి నెల ఫిబ్రవరిలో తీరు మార్చుకున్నారు. మార్చి, ఏప్రిల్‌లోనూ అదే పోకడ కనబరిచారు. ప్రస్తుత మే నెలలోనూ పెట్టుబడులు వస్తూనే ఉన్నాయ. కాగా, మార్చిలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో దాదాపు 23 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. ఈ నెల మొదలు ఇప్పటిదాకా దాదాపు 25 వేల కోట్ల రూపాయలు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్ల కంటే కూడా రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పిఐలు అమితాసక్తిని కనబరుస్తుండటం విశేషం.
స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు 9,007 కోట్ల రూపాయలుగా నమోదైతే, రుణ మార్కెట్లలోకి వచ్చినవి 15,769 కోట్ల రూపాయల పెట్టుబడులు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల విలువ 24,776 కోట్ల రూపాయల (3.85 బిలియన్ డాలర్లు)కు చేరింది. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు.
దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. దీంతో ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 94,900 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి లక్ష కోట్ల రూపాయలకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయ. కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జనవరితో కలుపుకుని 80,310 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.
ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి ఒంటరిగా గెలుచుకోవడం మదుపరుల విశ్వాసాన్ని చూరగొంది. దీంతో ఈ సంవత్సరం పెట్టుబడులు పోటెత్తుతున్నాయ.