బిజినెస్

ఆర్థిక గణాంకాలు, ఫలితాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్ స్థూల ఆర్థిక గణాంకాలు, రుతు పవనాల రాక, వర్ష సమాచారం, చివరి దశ ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఉంటుందన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయ. గత ఆర్థిక సంవత్సరం (2016- 17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను కోల్ ఇండియా, ఎల్‌అండ్ టి, ఎన్‌టిపిసి వంటి దిగ్గజ సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయ. దీంతో వీటి ఆధారంగా మదుపరుల పెట్టుబడులు ఉంటాయంటున్నారు మార్కెట్ విశే్లషకులు. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 563.29 పాయంట్లు పుంజుకుంటే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 167.20 పాయంట్లు పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైకి సూచీలు చేరుకు న్నాయ. సెనె్సక్స్ 31,028 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,595 వద్ద నిలిచింది. కాగా, ప్రస్తుత మే నెలకుగాను అమ్మకాల వివరాలను ఆటో రంగ సంస్థలు గురువారం (జూన్ 1) ప్రకటించనున్నాయ. దీంతో వాటి ప్రభావం కూడా మదుపరుల పెట్టుబడులపై, స్టాక్ మార్కెట్ల కదలికలపై తప్పక కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. మదుపరులను పెట్టుబడుల దిశగా నడిపిస్తున్నది తెలిసిందే. గత వారం ఈ కారణంగానే పెట్టుబడులు పోటెత్తాయ. ముఖ్యంగా ఎఫ్‌ఎమ్‌సిజి రంగానికి జిఎస్‌టి విధానం కలిసిరావడం తెలిసిందే. నాలుగు రకాల పన్నుల్లో తక్కువ రకం పన్నులకే ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తులు పరిమితం కావడం మదుపరులను మెప్పించింది. దీంతో ఆ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయ. ఈ వారమూ మదుప రులను ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు ఆకట్టుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. జూలై 1 నుంచి ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి) అమల్లోకి వస్తుం డగా, 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను కేటాయం చింది. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.