బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఎమ్‌డిసి
న్యూఢిల్లీ, మే 28: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎమ్‌డిసి పన్ను అనంతర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 512 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 459 కోట్ల రూపాయలుగా ఉంది అని సంస్థ ప్రకటించింది. ఆదాయం ఈసారి 2,872 కోట్ల రూపాయలుగా, పోయనసారి 1,530 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది. టర్నోవర్ కూడా 37 శాతం ఎగిసినట్లు చెప్పింది.
క్యాడిలా హెల్త్‌కేర్
ఔషధరంగ సంస్థ క్యాడిలా హెల్త్‌కేర్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 385.5 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ పన్ను అనంతర లాభం 568.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఏకీకృత ఆదాయం ఈసారి 2,598 కోట్ల రూపాయలుగా, పోయనసారి 2,426.4 కోట్ల రూపాయలుగా ఉందని క్యాడిలా హెల్త్‌కేర్ సంస్థ తెలియజేసింది.
నాల్కో
అల్యూమినియం తయారీదారు నాల్కో స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 268 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 214 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 2,549.7 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,994 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.
భారత్ ఫోర్జ్
ఆటో కంపోనెంట్స్ దిగ్గజం భారత్ ఫోర్జ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 207.50 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 165.57 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆదాయం ఈసారి 1,205.37 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,089.07 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్
దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 948 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 79 కోట్ల రూపాయల లాభం వచ్చింది. కాగా, సంస్థ ఏకీకృత ఆదాయం ఈసారి 4,524 కోట్ల రూపాయ లుగా ఉంది. నిరుడుతో పోల్చితే 24 శాతం తక్కువని రిలయన్స్ కమ్యూ నికేషన్స్ ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు తెలిపింది.

షెవర్లెట్ ‘డ్రైవ్ విత్ కేర్’ ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 28: ప్రముఖ విదేశీ ఆటో రంగ సంస్థ షెవర్లెట్.. రహదారి భద్రతలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన పెంచేందుకుగాను ‘డ్రైవ్ విత్ కేర్-ప్రొటెక్ట్ యువర్ ప్రీషియస్’ పేరిట ఆన్‌గ్రౌండ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యం ప్రధానంగా ఉంటుందని, తల్లిదండ్రులు, వారి పిల్లలకు దీని గురించి తెలియజేసేందుకు టైనీ టాయ్స్ బృందాన్ని షెవర్లెట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిల్లో సేఫ్టీ నింజాలను ఏర్పాటు చేసి జాగృతిలో భాగమైనట్లు షెవర్లెట్ తెలిపింది. తమవారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరూ వాహనాలను నడపాలని కోరింది.