బిజినెస్

అవును.. ‘చిల్లరకొట్టుకు చిల్లే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 28: చిన్న వర్తకులను నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తెస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్, ఇండస్ట్రీస్ (్ఫక్కీ) కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ ధ్వజమెత్తారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్టు కమ్యూనిటీహాలులో రాష్టస్థ్రాయి వర్తక మహాసభ జరిగింది. ‘ఆంధ్రభూమి దినపత్రిక’లో ఈ నెల 18న ‘చిల్లరకొట్టుకు చిల్లు’ శీర్షికన వచ్చిన సంపాదకీయం వర్తకుల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఈ సభలో ఆంధ్రభూమి సంపాదకీయాన్ని జైన్ ప్రస్తావించారు. యుపిఎ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ జిఎస్‌టి చట్టం అమలుకు ప్రయత్నించగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని నరేంద్ర మోదీ తమ రాష్ట్రంలో అమలు చేయనీయబోమని స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వర్తకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న జిఎస్‌టి గురించి ప్రశ్నించడానికి భయపడిపోతోందని విమర్శిం చారు. ఫిక్కీ ఎపి చైర్మన్ వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల వర్తక సంఘాలతో సమన్వయం చేసుకుని దక్షిణాది బంద్ పాటించి నిరసన తెలియజేయాలన్నారు. జిఎస్‌టి అమల్లోకివస్తే ఇంట్లో లావాదేవీలు తప్ప అన్ని లావాదేవీలకు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిఎస్‌టి చట్టంపై వర్తకులకు అవగాహన వచ్చేదాక నెలరోజుల పాటు ఆడిట్ నుంచి మినహాయింపునివ్వాలని, పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రతీ సిటిఓ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు మాట్లాడుతూ జిఎస్‌టినివర్తకులపై సర్జికల్ దాడిగా అభివర్ణించా రు. కోనసీమ వర్తక సంఘం అధ్యక్షుడు సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్తకులంతా బృందాలుగా ఏర్పడి లంచగొండి అధికారులను పట్టించాలని పిలుపునిచ్చారు. పన్ను మినహాయింపును 20 నుంచి 40 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, ఆడిటర్ రాహుల్ ఈ సందర్భంగా జిఎస్‌టిపై వర్తకులకు అవగాహన కల్పించారు.
మూడేళ్లపాటు మినహాయింపు ఇవ్వాలి
వర్తకులకు ఇబ్బందికరమైన జిఎస్‌టి విధానంలో మూడేళ్లపాటు శిక్షలు, జరిమానాలకు మినహాయింపు ఇవ్వాలని ఆదివారం జరిగిన వర్తక మహాసభ తీర్మానించింది. రిటర్న్స్‌లో పొరబాట్లకు వెసులుబాటు కల్పించాలని, స్థానిక సుద్దతో తయారయ్యే క్రూసిబుల్స్‌ను 28 శాతం పన్ను శ్లాబు నుంచి తప్పించాలని, సున్నా శాతం పన్ను ఉన్న సరుకుల లావాదేవీలు, రవాణా విషయంలో వెసులుబాటు కల్పించాలని, ఇంటి సామాగ్రి, ఫర్నీచర్, మేకులు, స్క్రూలు వంటి హార్డ్‌వేర్ సామాగ్రి, తినుబండారాలు విక్రయించే చిన్నస్థాయి హోటళ్లను 5 శాతం పన్ను పరిధిలోకి తేవాలని, 50 లక్షల లోపు టర్నోవర్ కలిగిన వర్తకులకు మాన్యువల్ బిల్లులు, అకౌంట్లు చేసుకునే వెసులుబాటు కల్పించాలంది. అలాగే దూరాన్నిబట్టి వే బిల్లులకు కాలపరిమితి విధించడం తగదని, ఈ విధానాన్ని రద్దు చేయాలని, జిఎస్‌టి అమలులో దుందుడుకు వైఖరికి స్వస్తి పలకాలని, కఠిన నిబంధనలను ఉపసంహరించాలని, వ్యవసాయ ఉత్పత్తులపై కొనుగోలు పన్ను విధించడం తగదని మహాసభ తీర్మానించింది.
రేపు మెడికల్ షాపులు, హోటల్స్ బంద్
కాకినాడ: జిఎస్‌టి విధానం, ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీ (మంగళవారం)న హోటల్స్ యాజమాన్యాలు, మందుల (మెడికల్) షాపుల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని హోటల్స్‌ను మూసివేసి బంద్‌కు సహకరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వై వెంకటేష్ కోరారు. జిఎస్‌టి వలన హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఆన్‌లైన్‌లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. వైద్యుల పర్యవేక్షణ, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో మందులు విక్రయించడం వలన అనేక దుష్ఫలితాలుంటాయని ప్రకటనలో హెచ్చరించిం ది. దీనివలన యువత డ్రగ్స్‌బారిన పడే ప్రమాదం ఉందంది. అలాగే ఐదేళ్ల అనుభవం కలిగిన కెమిస్ట్‌లను మాత్రమే ఫార్మాసిస్టులుగా పరిగణించాలని, హోల్‌సేల్ మందుల వర్తకులకు ఫార్మాసిస్టు ఉండాలంటూ జారీచేసిన జిఒను రద్దు చేయాలంది.
జిఎస్‌టిపై సందేహాల కోసం..
న్యూఢిల్లీ: మరోవైపు జిఎస్‌టి అమలుకు నెల రోజులే గడువున్న క్రమంలో రెవిన్యూ శాఖ జిఎస్‌టిపై సందేహాల నివృత్తి కోసం ఆదివారం ఓ ట్విట్టర్ హ్యాండిల్‌ను ప్రారంభించింది. ట్రేడర్లు, పరిశ్రమ బ్ఘఒరీదిడంద్యిని పై ప్రశ్నలు అడగవ చ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సమాధానాలు ఇస్తుందని తెలిపింది.