బిజినెస్

జోరు తగ్గని మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 81.07 పాయింట్లు పెరిగి 31,109.28 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 31,214.39 పాయింట్ల స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.80 పాయింట్లు అందుకుని 9,604.90 వద్ద నిలిచింది. ఒకానొక దశలో ఇది 9,637.75 పాయింట్లను చేరింది. గతకొద్ది రోజులుగా సూచీలు రోజుకో రికార్డు స్థాయిని నెలకొల్పుతున్నది తెలిసిందే.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మూడేళ్ల పాలనను ముగించుకున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడుల జోష్ లో కనిపిస్తున్నారు. దీంతో సూచీలు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డులను నెలకొల్పుతున్నాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్ర, రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లు మాత్రం సోమవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. గత ఆర్థిక సంవత్సరం (2016- 17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వీటి ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా లేకపోవడంతో మదుపరులు ఈ సంస్థల షేర్లను పెద్ద ఎత్తున అమ్మేశారు. ఫలితంగా సన్ ఫార్మా మార్కెట్ విలువ 15,766 కోట్ల రూపాయలు పడిపోయింది. దాదాపు 12 శాతం దిగజారిన ఈ సంస్థ షేర్ విలువ బిఎస్‌ఇలో 502.85 రూపాయల వద్ద నిలిచింది. అలాగే టెక్ మహీంద్ర మార్కెట్ విలువ 4,849 కోట్ల రూపాయలు క్షీణించింది. ఈ సంస్థ షేర్ విలువ కూడా బిఎస్‌ఇలో సుమారు 12 శాతం పతనమై 379.30 రూపాయల వద్ద స్థిరపడింది. ఇక అనీల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్ విలువ సైతం 1,318 కోట్ల రూపాయలు ఆవిరైంది. బిఎస్‌ఇలో సంస్థ షేర్ విలువ 20 శాతానికిపైగా కోల్పోయి 20.50 రూపాయల వద్దకు చేరింది.