బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ( లార్సెన్ అండ్ టూబ్రో)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్సెన్ అండ్ టూబ్రో
న్యూఢిల్లీ, మే 29: లార్సెన్ అండ్ టూబ్రో ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,025 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 2,335 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 36,828 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే ఆదాయం 12 శాతం పెరిగిందని చెప్పింది.
కోల్ ఇండియా
ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 2,716 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 4,398 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 26,635.9 కోట్ల రూపాయలుగా, నిరుడు 24,583.8 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం పేర్కొంది.
ఎన్‌టిపిసి
ఎన్‌టిపిసి స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 2,079.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 2,792.69 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 20,886.85 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం తెలిపింది. నిరుడు 18,732.41 కోట్ల రూపాయలని చెప్పింది.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్
ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,916.36 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 1,568.58 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం ఈసారి 7,054.45 కోట్ల రూపాయలుగా, నిరుడు 5,984.49 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వెల్లడించింది.
బిహెచ్‌ఇఎల్
ప్రభుత్వరంగ సంస్థ బిహెచ్‌ఇఎల్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 57 శాతం క్షీణించి 215.55 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 505.71 కోట్ల రూపాయల లాభం పొందింది. మొత్తం స్టాండలోన్ ఆదాయం ఈసారి 10,302.79 కోట్ల రూపాయలుగా, నిరుడు 10,870.49 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలియజేసింది.
ఆయల్ ఇండియా
ప్రభుత్వరంగ చమురు ఉత్పాదక సంస్థ ఆయల్ ఇండియా లిమిటెడ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 96 శాతం పడిపోయ 19.31 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 470.13 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం టర్నోవర్ ఈసారి 3,308.98 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,445.01 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం చెప్పింది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,409.49 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 1,259.65 కోట్ల రూపాయల లాభం అందుకున్నటుల సోమవారం తెలిపింది. మొత్తం స్టాండలోన్ ఆదాయం ఈసారి 5,797.04 కోట్ల రూపాయలుగా, నిరుడు 6,786.99 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.
పుంజ్ లాయడ్
వౌలిక రంగ దిగ్గజం పుంజ్ లాయడ్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 181.58 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 396.15 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం ఈసారి 1,027.31 కోట్ల రూపాయలుగా, నిరుడు 742.39 కోట్ల రూపాయలు గా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది.