బిజినెస్

మిగిలిన ఇసుకకే వేలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 8: పర్యావరణ అనుమతులు పొంది ప్రస్తుతం నడుస్తున్న రీచ్‌ల్లో తవ్వగా మిగిలిన ఇసుకకే వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నడిపించాలన్న నిర్ణయంలో భాగంగా పర్యావరణ అనుమతులు పొందిన రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్న సంగతి విదితమే. 25 హెక్టార్లు విస్తీర్ణం దాటితే పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాల్సి ఉండటంతో, 25 హెక్టార్ల విస్తీర్ణానికి లోబడే ఇసుక రీచ్‌లను నిర్ణయించి, మహిళా పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా అప్పగించిన ఇసుక రీచ్‌ల్లో ఎంత పరిమాణంలో ఇసుక తవ్వాలో కూడా పర్యావరణ అనుమతుల్లో నిర్ణయించారు. అందువల్ల మహిళా పొదుపు సంఘాలకు అప్పగించిన ఇసుక రీచ్‌ల్లో తవ్వగా, మిగిలిన ఇసుకకు మాత్రమే కొత్త ఇసుక విధానంలో వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 8 లేదా 9 నాటికి కొత్త ఇసుక విధానాన్ని ఖరారుచేసి, వేలం నిర్వహణ, విధి విధానాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1నాటికి కొత్త ఇసుక విధానంలోనే ఇసుక తవ్వకాలు, అమ్మకాలు సాగించాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా పొదుపు సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రస్తుత విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 850 కోట్లు ఆదాయం లభించిన నేపథ్యంలో, అంతకు తగ్గకుండా కొత్త విధానంలో ఇసుక నుండి ఆదాయాన్ని సంపాదించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ ఉద్దేశ్యంతోనే ఇసుక అమ్మకాల్లో ఎక్కువ వాటా ఇచ్చే విధంగా టెండర్లు దాఖలుచేసే వారికే రీచ్‌లను కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ అనుమతులతో ప్రస్తుతం నడుస్తున్న రీచ్‌లతోపాటు, అదనంగా కొత్త రీచ్‌లను గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రీచ్‌లను ప్రారంభించటం పర్యావరణ నిబంధనల ప్రకారం అంత తేలికైన వ్యవహారం కాదు. కొత్త రీచ్‌ను ప్రారంభించాలంటే, పర్యావరణ అనుమతులు పొందేందుకు సుదీర్ఘమైన ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం పర్యావరణ అనుమతులతో నడుస్తున్న రీచ్‌లను కొనసాగిస్తూనే, రానున్న రోజుల్లో కొత్త రీచ్‌లను తవ్వకాలకు సిద్ధంచేసుకోవటం ద్వారా ఇసుక ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.

ఎఫ్‌ఐపిబి పరిశీలనకు 14 ఎఫ్‌డిఐలు
న్యూఢిల్లీ, జనవరి 8: ఈ నెల 14న జరిగే సమావేశంలో విదేశీ పెట్టుబడులు, ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. 14 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించనుంది. వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా తదితర సంస్థల ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా, చివరిసారిగా గత నెల డిసెంబర్ 29న జరిపిన సమావేశంలో 1,810 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం తెలిపినది తెలిసిందే.