బిజినెస్

2016-17లో టిసిఎస్ సిఇఒగా చంద్రశేఖరన్ వేతనం రూ. 30 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: టాటా గ్రూప్ సంస్థల అధిపతి, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్.. టిసిఎస్ సిఇఒగా గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 30.15 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. టాటాల సారథిగా బాధ్యతలు స్వీకరించక ముందు చంద్రశేఖరన్ దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ సిఇఒగా ఉన్నది తెలిసిందే. సైరస్ మిస్ర్తి స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 100కుపైగా సంస్థలున్న, 103 బిలియన్ డాలర్ల విలువైన టాటా సన్స్ నాయకత్వాన్ని చంద్రశేఖరన్ తీసుకున్నారు. కాగా, టిసిఎస్ సిఇఒగా చంద్రశేఖరన్ వార్షిక వేతనం 2.44 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలు కమీషన్, 2.7 కోట్ల రూపాయలు ఇతరత్రా అలవెన్సులు.
మరో సరికొత్త స్థాయికి
స్టాక్ మార్కెట్లు
ముంబయి, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డులు కొనసాగుతున్నాయి. మంగళవారం మరో సరికొత్త స్థాయిని చేరుకున్నాయి. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 50.12 పాయింట్లు పెరిగి 31,159.40 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.65 పాయింట్లు అందుకుని 9,624.55 వద్ద స్థిరపడింది.

రూ. 11 లక్షలు తగ్గిన జెఎల్‌ఆర్ ధరలు
న్యూఢిల్లీ, మే 30: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ వాహనాల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) వాహనాల ధరలు 11 లక్షల రూపాయల వరకు తగ్గాయి. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే లక్ష్యంతో జాగ్వార్ ఎక్స్‌ఇ సెడాన్ ధరను 2 నుంచి 5.7 లక్షల రూపాయల వరకు, జాగ్వార్ ఎక్స్‌జె ధరను 4 నుంచి 10.9 లక్షల రూపాయల వరకు తగ్గిస్తామని మంగళవారం జెఎల్‌ఆర్ ప్రకటించింది. లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవాక్యు ధరలను 3.3 నుంచి 7.5 లక్షల రూపాయల వరకు తగ్గుతాయి.