బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. 19 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 82.50 పాయింట్లు పెరిగి 24,934.33 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.05 పాయింట్లు లాభపడి 7,601.35 వద్ద నిలిచింది. అంతకుముందు నాలుగు వారాల్లో సెనె్సక్స్ 1,309.07 పాయింట్లు పతనమైంది. అయితే అంతర్జాతీయంగా చైనా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగడం, దేశీయంగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం టం వంటివి శుక్రవారం మార్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఇక ఈ వారంలో సెనె్సక్స్ 1,226.57 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ సైతం 361.85 పాయింట్లు నష్టపోయింది. చైనా ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల మధ్య భౌగోళిక వైషమ్యాలు మార్కెట్లను కుదేలు చేశాయి. ఫలితంగా గడచిన నాలుగేళ్ళకుపైగా కాలంలో ఒక వారంలో ఇంతటి నష్టాలను తొలిసారిగా దేశీయ సూచీలు చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.59 శాతం నుంచి 1.97 శాతం పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.60 శాతం నుంచి 0.92 శాతం పెరిగాయి.

లెనోవా, గూగుల్ స్మార్ట్ఫోన్
న్యూయార్క్, జనవరి 8: కంప్యూటర్ల తయారీ దిగ్గజం, చైనా సంస్థ లెనోవా.. గూగుల్ భాగస్వామ్యంతో ఓ కొత్త స్మార్ట్ఫోన్‌ను తీసుకురానుంది. గూగుల్ 3డి టెక్నాలజీ అయిన ప్రాజెక్ట్ ట్యాంగో సహకారంతో ఈ స్మార్ట్ఫోన్ ద్వారా వినియోగదారులు తమ చుట్టూ ఉన్న వాటిని క్షుణ్ణంగా పరీశీలించగలరని లెనోవా శుక్రవారం తెలిపింది.
800 మిలియన్లు దాటిన
ఫేస్‌బుక్ మెసేంజర్ వినియోగదారులు
ఫ్రాన్సిస్కో, జనవరి 8: ఫేస్‌బుక్ మెసేంజర్ అప్లికేషన్ వినియోగదారులు 800 మిలియన్లను దాటిపోయారు. గత ఏడాది అత్యంత వేగంగా విస్తరించిన సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా ఫేస్‌బుక్ మెసేంజర్ నిలిచింది. 2014తో పోల్చితే 2015లో ఫేస్‌బుక్ మెసేంజర్ వినియోగదారులు 2015లో 31 శాతం పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
నిరాశపరిచిన జర్మనీ, ఫ్రాన్స్
పారిశ్రామికోత్పత్తి
ఫ్రాంక్‌ఫర్ట్, జనవరి 8: ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి పరంగా క్షీణతను చవిచూశాయి. జర్మనీ పారిశ్రామికోత్పత్తి 0.3 శాతం, ఫ్రాన్స్ పారిశ్రామికోత్పత్తి 0.9 శాతం పడిపోయాయి. ఈ మేరకు శుక్రవారం గణాంకాల్లో తేలింది. దీంతో ఆర్థిక మందగమనం నుంచి యూరోజోన్ కోలుకుంటోందన్న ఆనందం ఆవిరైపోయింది.