బిజినెస్

జిఎంఆర్‌కు బులంద్ భారత్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: జిఎంఆర్ గ్రూప్‌నకు ప్రతిష్టాకరమైన బులంద్ భారత్ అవార్డు లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన అఖిల భారత బిల్డర్స్ సదస్సులో ఈ అవార్డును జిఎంఆర్ సిఇవో ఎస్‌జికె కిషోర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రదానం చేసి సత్కరించారు. ఈ అవార్డు తమ సంస్థకు లభించడం పట్ల జిఎం రావు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వౌలిక సదుపాయాల రంగంలో తాము విశిష్ట సేవలు అందిస్తుంటామన్నారు. నాణ్యతలో రాజీపడమని, ప్రజలకు సామాజికసేవలు అందిస్తామని చెప్పారు. జాతీయ నిర్మాణంలో చురుకుగా పాల్గొంటామని, ప్రపంచ స్ధాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్మించిన భాగ్యం తమకు దక్కడం అదృష్టమన్నారు.

అవార్డును అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్,
కేంద్ర మంత్రి వెంకయ్య
నాయుడు

అభినవ దానకర్ణుడు
అజీమ్ ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ, జనవరి 8: సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ రంగాల అభివృద్ధి కోసం విరాళాలిస్తున్న దేశీయ కార్పొరేట్ వర్గాల్లో వరుసగా మూడో ఏడాది విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా ఫిలంత్రొఫి జాబితా ప్రకారం 70 ఏళ్ల ప్రేమ్‌జీ.. దేశంలో విద్యాభివృద్ధికి 27,514 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ నేతృత్వంలోని ఫౌండేషన్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జరుగుతుండగా, 3,50,000లకుపైగా పాఠశాలలకు ఫౌండేషన్ సేవలు అందుతున్నాయి. కాగా, ఈ జాబితాలో రెండో స్థానంలో నందన్ నిలేఖని, మూడో స్థానంలో నారాయణ మూర్తి నిలిచారు. నిలేఖని, ఆయన భార్యో రోహిణి నిలేఖని పట్టణాభివృద్ధికి 2,404 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక మూర్తి కుటుంబం సామాజికాభివృద్ధి, విద్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతగా 1,322 కోట్ల రూపాయలన విరాళంగా ఇచ్చింది. భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వైద్యం కోసం 345 కోట్ల రూపాయలను వెచ్చించగా, టాప్ 10లో ఆరో స్థానంలో నిలిచారు. కాగా, కె దినేశ్ 1,238 కోట్ల రూపాయలతో నాలుగో స్థానం, శివ్ నాడర్ 535 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక 326 కోట్ల రూపాయలతో సన్నీ వర్కీ కుటుంబం ఏడో స్థానంలో, 158 కోట్ల రూపాయలతో రోన్నీ స్క్రేవ్లా ఎనిమిదవ స్థానంలో, 139 కోట్ల రూపాయలతో రాహుల్ బజాజ్ కుటుంబం తొమ్మిదవ స్థానంలో, 96 కోట్ల రూపాయలతో పల్లోంజి మిస్ర్తి పదవ స్థానంలో ఉన్నారు.