బిజినెస్

బలపడిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 21: మూడు వరుస సెషన్లలో నష్టాల పాలయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలపడినాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 141 పాయింట్లు పుంజుకుంది. వీటితో పాటు ఎఫ్‌ఎంసీజీ, చమురు- సహజ వాయువు రంగాల షేర్ల ధరలు పెరగడం కూడా బుధవారం కీలక సూచీలు పుంజుకోవడానికి దోహదపడింది. ఆసియా మార్కెట్లలో నెలకొన్న పటిష్ఠమైన స్థితితో పాటు ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా బుధవారం దేశీయ మార్కెట్లు బలపడటానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఫిబ్రవరి నెల ఎఫ్‌అండ్‌ఓ కాల పరిమితి గురువారంతో ముగియనుండటంతో స్పెక్యులేటర్లు షార్ట్-కవరింగ్‌కు పూనుకోవడం కూడా కీలక సూచీలు పుంజుకోవడానికి తోడ్పడింది. సెనె్సక్స్ ఇంట్రా-డేలో 33,911.36 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల 33,702.50 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 141.27 పాయింట్ల (0.42 శాతం) లాభంతో 33,844.86 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం మూడు సెషన్లలో కలిపి 593.88 పాయింట్లు పడిపోయింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం 37.05 పాయింట్లు (0.36 శాతం) పెరిగి, 10,397.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 10,426.10- 10,349.60 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, మంగళవారం దేశీయ సంస్థాగత మదుపరులు నికరంగా రూ. 1,437.24 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు రూ. 850.35 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల ఆదాయం 7-9 శాతం పెరుగుతుందన్న నాస్కామ్ అంచనా సానుకూలంగా పనిచేయడంతో బుధవారం ఐటీ కంపనీల షేర్ల విలువ పెరిగింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ అత్యధికంగా 3.33 శాతం లాభపడింది. ఐటీసీ షేర్ విలువ రెండు శాతం పెరగగా, ఓఎన్‌జీసీ 1.66 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, రిల్, కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా ఉన్నాయి.
వీటి షేర్ల విలువ 1.28 శాతం పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ముంచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్ షేర్ల విలువ వరుసగా ఆరో సెషన్ బుధవారం కూడా పడిపోయింది. కాగా, అయిదు వరుస సెషన్లలో 56 శాతం పడిపోయిన పీఎన్‌బీ షేర్ విలువ ఆరో రోజు బుధవారం 0.47 శాతం పెరిగింది.
బుధవారం నష్టపోయిన ఇతర సంస్థల్లో సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, పవర్ గ్రిడ్, ఆసియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం ఉన్నాయి.