బిజినెస్

మదుపరులకు ‘అంతర్జాతీయ’ భయాలు ( వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: వరుస లాభాల్లో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం ఒక్కసారిగా భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. 19 నెలల కనిష్ట స్థాయికి సూచీలు క్షీణించాయి. అంతకుముందు మూడు వారాల్లో లాభాల్లోనే ఉండగా, గడచిన వారం మాత్రం చైనా స్టాక్ మార్కెట్ల పతనం, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ ప్రయోగం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25వేల దిగువన 1,226.57 పాయింట్లు క్షీణించి 24,934.33 వద్ద ముగిసింది. అంతకుముందు మూడు వారాల్లో 1,116.47 పాయింట్లు పెరిగింది సెనె్సక్స్. అయితే ఒక్క వారాంలోనే మూడు వారాల్లో సాధించిన లాభాలకుపైగా నష్టాలను అందుకోవాల్సి వచ్చింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం గడచిన వారం 361.85 పాయింట్లు దిగజారింది. 7,601.35 వద్ద స్థిరపడింది. అంతకుముందు మూడు వారాల్లో నిఫ్టీ 352.75 పాయింట్లు కోలుకుంది. బ్యాంకింగ్ రంగ షేర్లు అత్యధికంగా 10.69 శాతం నష్టపోగా, ఆటో 6.99, క్యాపిటల్ గూడ్స్ 6.89, మెటల్ 4.33, హెల్త్‌కేర్ 3.94 శాతం, రియల్టీ 3.78, ఎఫ్‌ఎమ్‌సిజి 3.74, టెక్నాలజీ 2.86, విద్యుత్ 2.42, ఐటి 2.23, చమురు, గ్యాస్ 0.29 శాతం చొప్పున పడిపోయాయి. స్మాల్-క్యాప్ 2.42 శాతం, మిడ్-క్యాప్ 2.25 శాతం మేర కోల్పోయాయి. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 3,114.56 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 18,182.70 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 89,534.28 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,281.81 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 75,637.11 కోట్ల రూపాయలుగా ఉంది.