బిజినెస్

అంతంతమాత్రంగానే ఐటి సంస్థల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: భారతీయ ఐటి సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై వరదలు, అమెరికా, ఐరోపా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతీయ ఐటి సంస్థల ఆదాయం తక్కువగానే ఉంటుందని, అయితే చెన్నై వరదల కారణంగా ఈసారి మరింతగా పడిపోయే వీలుందని వారు విశే్లషిస్తున్నారు. దేశీయ ఐటి సంస్థల ఆదాయంలో సుమారు 85 శాతం వాటా కలిగిన అమెరికా, ఐరోపా మార్కెట్లలో క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు ఆదాయానికి గండి కొడుతున్నాయన్నారు. ఈ క్రమంలో చెన్నై వరదలు దాదాపు వారం రోజులపాటు ఐటి సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయన్నారు. గడచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తినది తెలిసిందే. దీంతో అక్కడి జనజీవనం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇన్ఫోసిస్ తదితర సంస్థల్లోకి వరదనీరు రాగా, ఉద్యోగులు ఎక్కడివారక్కడే ఇరుక్కుపోయారు. కాగా, ఈ నెల 12న టిసిఎస్ తమ అక్టోబర్-డిసెంబర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుండగా, ఆ తర్వాత ఇన్ఫోసిస్ (14న), విప్రో (18న), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (19న) విడుదల చేయనున్నాయి.