బిజినెస్

ఆర్థిక ఫలితాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: కార్పొరేట్ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లోని మూడో త్రైమాసికాని (అక్టోబర్-డిసెంబర్)కి సంబంధించి విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటి రంగ సంస్థలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌తోపాటు హిందుస్థాన్ యునిలివర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ తదితర సంస్థ తమ తృతీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి. దీంతో వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చనే విశే్లషణలు వినిపిస్తున్నాయి. అలాగే స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం కూడా ట్రేడింగ్‌పై ఉంటుందని, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ సరళిని నిర్దేశించగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నవంబర్ నెలకుగాను ఐఐపి, గత నెల డిసెంబర్‌కుగాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం విడుదలవుతున్నాయి. ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు వంటివి కూడా మార్కెట్లను శాసిస్తాయని డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. అయితే దేశీయంగా కంటే అంతర్జాతీయ పరిణామాలే భారతీయ స్టాక్ మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాన్ని బ్రోకరేజ్ సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ వ్యక్తం చేసింది. కాబట్టి కొంతమేర ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించాలని మదుపరులకు సూచించింది. వరుసగా మూడు వారాలపాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టపోయినది తెలిసిందే. చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అనుమానాలు, సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళనలు, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం వంటివి విదేశీ స్టాక్ మార్కెట్లను, దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టపరిచాయి. దీంతో ఈ పరిణామాల ప్రభావం ఈ వారం కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,226.57 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 361.85 పాయింట్లు కోల్పోయాయి.