బిజినెస్

పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: సాగరతీరం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహాయ మంత్రి వై సుజనా చౌదరి పిలుపునిచ్చారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండో రోజైన సోమవారం జరిగిన పోర్టుల అభివృద్ధితో ఆర్థికంగా ముందంజ అంశంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోర్టులు అభివృద్ధి జరగాలంటే తొలుత వౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. సాగరమాల ప్రాజెక్టు.. పోర్టులకు అనుసంధానంగా వౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినదేనని తెలిపారు. వౌలిక సదుపాయాల కల్పన సరుకు రవాణాకు మూలమని పేర్కొన్నారు. నూతన పోర్టుల అభివృద్ధిలో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పోర్టుల ఏర్పాటుకు, ఆయా ప్రాంతా ల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులు పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని కోరారు. పోర్టుల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను ప్రాధాన్యతాంశంగా గుర్తించాలన్నారు. భారత ప్రభుత్వ ఎగుమతులు, దిగుమతుల బ్యాంకు (ఎగ్జిమ్) చైర్మన్ యదువేందర్ మాధుర్ మాట్లాడుతూ ఎగ్జిమ్ బ్యాంకు భారీ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. వౌలిక సదుపాయాల కల్పనలో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు వరంగా ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మేకిన్ ఇండియా కేవలం భారత తయారీ రంగానికే పరిమితం కాదని, ఎగుమతుల రంగంలో నూతనోత్తేజాన్ని కల్గించేందుకూ ఉద్దేశించినదేనన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలకడమంటే స్థానిక ఉత్పత్తులకు చరమగీతం పాడటం కాదన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కెపిఎంజి ముఖ్యకార్యనిర్వాహణ అధికారి రిచర్డ్ రెఖి మాట్లాడుతూ పోర్టు సేవలు గేట్‌వేగా నిలుస్తాయన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ చెన్నై-కోల్‌కతా తీర ప్రాంతంలో సరుకుల రవాణాను విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. తీర ప్రాంతంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

భాగస్వామ్య
సదస్సులో
ప్రసంగిస్తున్న కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి