బిజినెస్

ఏపిలో నూతన రిటైల్ ట్రేడ్ పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైల్ ట్రేడ్ పాలసీ 2015-20ను సోమవారం ప్రకటించింది. ఐదేళ్ల కాలానికిగాను తెచ్చిన ఈ పాలసీకి సంబంధించి ఏపి సర్కారు ఓ జివో జారీ చేసింది. గతంలో ముంబయి రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తి దృష్ట్యా కొత్తగా ఏర్పడిన ఏపి ప్రభుత్వం ఈ జివో జారీ చేసింది. రిటైల్ రంగాన్ని వృద్ధి చేసేందుకుగాను రిటైల్ ట్రేడింగ్‌పై స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని రిటైలర్స్ అసోసియేషన్ కోరింది. నూతన రిటైల్ విధానం ద్వారా ఏపిలో రిటైల్ రంగం ఊపందుకోగలదన్న విశ్వాసాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడేందుకు కొత్త రిటైల్ ట్రేడ్ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపింది. 2020 నాటికి రాష్ట్రంలోకి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చేలా, 20,000 మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా ఈ కొత్త విధానం ప్రకటించినట్లు చెప్పింది. ఈ కొత్త విధానం ఐదేళ్లపాటు కొనసాగుతుంది. కాగా, గిడ్డంగుల నిర్మాణం, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రిటైల్ లాజిస్టిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చే ఉద్దేశంతో ఈ విధానం ప్రకటించినట్లు జివోలో ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు రవాణా సదుపాయంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, ఎపిఐఐసి ద్వారా పంపిణీ కేంద్రాలకు, గిడ్డంగుల నిర్మాణానికి అవసరమైన భూమిని కమర్షియల్ కేటగిరిలో 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చే నిబంధనలను కొత్త పాలసీలో పొందుపరిచామని ప్రభుత్వం వెల్లడించింది. రిటైల్ వ్యాపారం కోసం ఏపికి వచ్చే వారందరికి వెంటనే అనుమతులు మంజూరు చేసే విధంగా సింగిల్ డెస్క్ పాలసీని అమలు చేస్తున్నామని, జిల్లాల కలెక్టర్లు నోడల్ ఆఫీస ర్లుగా జిల్లా స్థాయిలో వ్యవహరిస్తారని తెలిపింది. ఈ డెస్క్ ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.
గ్జియాన్ లాంగి సిలికాన్ మెటీరియల్స్ కార్పొరేషన్‌కు రాయితీలు
శ్రీసిటీలో ఉన్నతస్థాయి సామర్థ్యం ఉన్న సోలార్ సెల్స్, మోడ్యుల్స్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న గ్జియాన్ లాంగి సిలికాన్ మెటీరియల్స్ కార్పొరేషన్‌కు రాయితీలను ప్రకటిస్తూ ఏపి ప్రభుత్వం జివో జారీ చేసింది. పవర్ సబ్సిడీ కేటగిరీలో నిరంతర విద్యుత్, అతి తక్కువ ధరకే విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కల్పించడం జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ పాలసీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్, స్టాంప్ డ్యూటీ, క్యాపిటల్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, స్కిల్ అప్‌గ్రేడేషన్ వంటి వాటిని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.