బిజినెస్

ఎస్‌బిఐ నాన్-కోర్ ఆస్తుల నగదీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. నాన్-కోర్ ఆస్తులను నగదుగా మార్చుకోవాలని ఆలోచిస్తోంది. అలాగే అనుంబంధంగా ఉన్న బ్యాంకింగ్ సంస్థలను లిస్టింగ్ చేయాలని కూడా యోచిస్తోంది. పెట్టుబడులు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికే ఇదంతా అని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మంగళవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం అసోచామ్ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. బాసెల్-3 నిబంధనలు 2019 మార్చి నుంచి అమల్లోకి రానుండటంతో వాటికి తగ్గట్లుగా నిధులను సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసెల్-3 నిబంధనల ప్రకారం 1.80 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, ప్రభుత్వం మాత్రం 70 లక్షల కోట్ల రూపాయలనే సర్దుతామని చెప్పినట్లు భట్టాచార్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీంతో మిగతా నిధుల అనే్వషణపై దృష్టి పెట్టామని, ఈ క్రమంలోనే రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో అనుబంధ బ్యాంకులను స్టాక్ మార్కెట్లలోకి తీసుకొచ్చి తద్వారా నిధులను సమీకరించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బిఐ జనరల్‌లో వాటాలను విక్రయించి నిధులను అందుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
chitram..
అసోచామ్ కార్యక్రమంలో అరుంధతీ భట్టాచార్య