బిజినెస్

వచ్చేవారమే అన్నదమ్ముల ఒప్పందం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలు టెలికామ్ రంగంలో చేతులు కలిపేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమ్ముడి నెట్‌వర్క్‌పై అన్న 4జి సేవలు అందించడానికి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జెఐఎల్).. వచ్చేవారం స్పెక్ట్రమ్ అమ్మకం, భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12 సర్కిళ్లలో 800-850 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ విక్రయానికిగాను రిలయన్స్ జియో నుంచి ఆర్‌కామ్ దాదాపు 4,500 కోట్ల రూపాయలను పొందనుంది. కాగా, ఈ మొత్తాన్ని టెలికాం శాఖకు సరళీకరణ ఫీజుగా చెల్లించడానికి ఆర్‌కామ్ వినియోగించనుంది. గత నెల 22న స్పెక్ట్రమ్ సరళీకరణ ఫీజుగా 5,600 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్‌కామ్‌కు టెలికాం శాఖ నోటీసులు అందజేసింది. 16 సర్కిళ్లకు సంబంధించి ఈ నోటీసు జారీ అవగా, వన్ టైమ్ స్పెక్ట్రమ్ చార్జీగా 1,569 కోట్ల రూపాయల బ్యాంక్ పూచీకత్తునూ సమర్పించాలని అందులో పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే ఇచ్చినందున చెల్లింపు ఉండకపోవచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పందించేందుకు మాత్రం రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిరాకరించింది. కాగా, ఆర్‌కామ్ నుంచి పొందే 800-850 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను రిలయన్స్ జియో కేవలం 4జి ఎల్‌టిఇ సేవలకే వినియోగించనుంది.