బిజినెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఐఎంజడ్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణలో ఎన్‌ఐఎంజడ్ (నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీని వలన ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ట్విట్టర్’లో వెల్లడించారు. ‘తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎన్‌ఐఎంజడ్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చాం. ప్రధానంగా ఫార్మాస్యూటికల్ (ఔషధ) పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఏర్పాటయ్యే ఈ ఎన్‌ఐఎంజడ్ ద్వారా ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’ అని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ శ్రేణి వౌలిక వసతులతో ఏర్పాటయ్యే మెగా ఇండస్ట్రియల్ జోన్లనే నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు అంటారు. దేశంలో ఎన్‌ఐఎంజడ్‌లను ప్రమోట్ చేసేందుకు నిబంధనలను సడలించడంతో పాటు పన్నులకు సంబంధించి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందజేస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రస్తుతం 16 శాతంగా ఉన్న ఉత్పత్తి రంగం వాటాను రానున్న దశాబ్ధ కాలంలో 25 శాతానికి పెంచడంతో పాటు 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలన్నది నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రధాన లక్ష్యంగా ఉంది.