బిజినెస్

పప్పుధాన్యాల సరఫరా ఇప్పటికీ సవాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: దేశంలో ప్రజలకు పప్పుధన్యాలను సరఫరా చేయడం ఇప్పటికీ ‘సవాలుగానే’ కొనసాగుతోందని ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పప్పులను నిల్వచేసి ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వం దిగుమతులను కొనసాగిస్తుండటంతో పాటు రైతుల నుంచి ఇప్పటివరకూ 15 వేల టన్నుల పప్పు్ధన్యాలను సేకరించిందని ఆయన గురువారం వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కిలో కందిపప్పు ధర 180 రూపాయలు పలుకుతుండటంతో ఈ ఏడాది 1.5 లక్షల టన్నుల పప్పు్ధన్యాలను నిల్వ చేసేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) గత నెలలో అనుమతి ఇచ్చింది. అయితే దేశంలో పప్పుదినుసుల ధరలను అదుపు చేయడం, సరసమైన ధరలకు వాటిని ప్రజలకు సరఫరా చేయడం ఇప్పటికీ సవాలుగానే కొనసాగుతోందని, డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణమని పాశ్వాన్ గురువారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం గత 19 నెలల పాలనలో సాధించిన విజయాలను ఆయన వివరిస్తూ, దేశంలో ప్రతి సంవత్సరం పప్పు ధాన్యాలకు డిమాండ్ పెరుగుతోందని, ఉత్పత్తి మాత్రం పెరగడం లేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 5 వేల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకోవడంతో పాటు మరో 10 వేల టన్నుల దిగుమతికి టెండర్లు వేశాయని, అలాగే ప్రైవేటు వ్యాపార సంస్థలు 4 వేల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకున్నాయని పాశ్వాన్ వివరించారు. పప్పు ధాన్యాల నిల్వ గురించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నేరుగా రైతుల నుంచి 15 వేల టన్నులకు పైగా పప్పులను సేకరించినట్లు తెలిపారు. 2015-16 ఖరీఫ్, రబీ సీజన్లలో కనీస మద్దతు ధరకంటే అధికంగా మార్కెట్ ధరకు పప్పు ధాన్యాలను సేకరించడం జరుగుతుందని, ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగిస్తామని పాశ్వాన్ స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ), సహకార రంగంలోని నాఫెడ్‌లతో పాటు ఎస్‌ఎఫ్‌ఎసి (స్మాల్ ఫార్మర్స్ అగ్రీ-బిజినెస్ కన్సార్టియం) ద్వారా వీటిని సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. గత వ్యవసాయ సంవత్సరం (2014 జూన్ నుంచి 2015 జులై వరకు) దేశంలో పప్పు్ధన్యాల ఉత్పత్తి 2 మిలియన్ టన్నులు క్షీణించి 17.2 మిలియన్ టన్నులకు తగ్గడంతో వాటి ధరలు ఆకాశాన్నంటాయని, అందుకే పెద్ద మొత్తంలో పప్పు దినుసులను నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పాశ్వాన్ వివరించారు. రుతుపవనాల లోటు వలన దేశంలో ఈ ఏడాది కూడా పప్పు్ధన్యాల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ధరలను అదుపుచేసి సరఫలాను మెరుగుపరిచేందుకు సకాలంలో పప్పు దినుసులను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా పప్పు్ధన్యాలు ఉత్పత్తి అవుతోంది భారత్‌లోనే. అయితే దేశంలో ఉత్పత్తి కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో కొరతను అధిగమించేందుకు దిగుమతులను ఆశ్రయించాల్సి వస్తోంది.
chitram...
విలేఖర్ల సమావేశంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆహార శాఖ మంత్రి పాశ్వాన్

ఉపాధి హామీ అమల్లో ఏపి టాప్

అవార్డు అందజేయనున్న కేంద్రం

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 21: ఉపాధి హామీ పథకాన్ని అమలుపర్చడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి హామీని పారదర్శకత, నిబద్ధతతో నెరవేరుస్తున్నందుకుకు ఏపీ సర్కార్‌కు కేంద్రం పురస్కారం అందజేయనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు త్వరలోనే ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు పురస్కారాన్ని అందుకోనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సరికొత్త జీవన విధానం లభించింది. వ్యవసాయ కార్మికులు, కూలీలు పని కోసం పుట్టిన పల్లెలను విడిచి సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పని తప్పి.. కొత్త పనులు దొరికాయి. సంవత్సరంలో వంద రోజుల గ్యారంటీ ఉపాధి, వ్యవసాయ పనుల్లో లభించే కూలీ కంటే ఎక్కువ కూలీ పొందేలా ఈ పథకం అమలవుతుంది. పేద కూలీలకు పని దినాలు కల్పించడంతో పాటు ప్రజోపయోగకర కార్యక్రమాన్ని చేపట్టి కూలీలకు వీలైనంత త్వరలో వేతనం అందేలా రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. దీంతో పేదల జీవనోపాధిని మెరుగుపర్చడం, సామాజిక భద్రత కల్పించడం, పంచాయతీరాజ్ సంస్థలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 13,099 గ్రామ పంచాయతీల్లో 47,638 వాడవాడల్లో ఈ పథకం అమలు జరుగుతోంది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటికి ఒక కోటీ 16 లక్షల మందికి ఉపాధి కల్గింది. 1562 కోట్ల పనిదినాలు కల్పించి రూ.22,836 కోట్ల విలువైన పనులు చేశారు. మొత్తం పనిదినాల్లో ఎస్సీలకు 24.2శాతం, ఎస్టీలకు 11.8 శాతం పనులను కల్పించింది.
రాష్ట్రంలోని 2,91,371 కుటుంబాలకు పూర్తిస్థాయిలో 100 రోజుల ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. 15 రోజుల్లోనే కూలీల వేతనాలను 78 శాతం చెల్లించింది. కూలీల ఆధార్ నెంబర్లను 97 శాతం అనుసంధానం చేసి, ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన పంట సంజీవని, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడవాడలా చంద్రన్న బాట వంటి కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం కింద తీసుకోవడం తదితర కీలక నిర్ణయాలు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాయి.
ప్రతి ఆర్ధిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 100 పనిదినాలు కల్పించడమే కాకుండా కరవు ప్రాంత గ్రామాల్లో మరో 50 రోజులు అదనంగా మొత్తం 150 పనిదినాలు కల్పిస్తున్నారు. కనీస వేతనాన్ని 169 రూపాయల నుంచి 180 రూపాయలకు పెంచారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేద, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించి, సామాజిక భద్రతను పెంపొందించింది. గ్రామీణ ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధితో పాటు పేదరిక నిర్మూలన, మహిళా సాధికారిత, వ్యవసాయ కూలీల్లో వలసను అరికట్టడం, కరవు కాటకాలను రూపుమాపడం, భూగర్భ జలాలను ఇనుమడింప చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి ఆశయ సాధనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందనుటలో ఎలాంటి సందేహం లేదు.