బిజినెస్

సమస్యల పరిష్కారానికి నూతన మార్గాలను అనే్వషించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు అసాధారణ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సంప్రదాయ పద్ధతులను వీడి నూతన ఆవిష్కరణల దిశగా పయనించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, డార్ట్ వౌత్ కాలేజ్ ఆఫ్ టెక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యాపకుడు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మార్విన్ బొవర్ సభ్యుడైన విజయ్ గోవిందరాజన్ అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజానికి నేడు కార్పొరేట్ రంగం ప్రతీ సమస్యకు తమ వ్యూహాలను మార్చుకుంటూ పురోగతి కోసం ఆవిష్కరణలు చేపడుతున్నాయని, మార్కెట్లలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి తమ ఉత్పత్తులను కొనేలా చేయడం కోసం పలు విధానాలను అనుసరిస్తున్నాయని వివరించారు. అయతే అన్ని సమస్యలూ ఒకేలా ఉండవన్న ఆయన సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా మరిన్ని కొత్త పద్ధతులను కనుగొనడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఇందులోభాగంగానే బంగ్లాదేశ్‌లో ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిపథంలో నడిపింది వివరించారు. ఎలాంటి తనఖాలు లేకుండా పేదలకు ఆ బ్యాంకు ఎలా రుణాలిచ్చిందో తెలిపారు. తద్వారా ఆ దేశంలో పేదరిక నిర్మూలనకు బ్యాంక్ ఏవిధంగా దోహదపడుతుందో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంటి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆటో ఎక్స్‌పోలో 10 హోండా మోడళ్లు

న్యూఢిల్లీ, జనవరి 26: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ).. రాబోయే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 10 మోడళ్లను ప్రదర్శించనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో హోండా మోటార్‌సైకిల్ తెలియజేసింది. ఈ 10 మోడళ్లలో నాలుగు ఇంతకుముందున్న మోడల్స్‌ను సరికొత్త డిజైన్‌తో, మరిన్ని సౌకర్యాలతో రూపొందించినవేనని హోండా పేర్కొంది. మరో నాలుగు కానె్సప్ట్ మోడళ్లను పరిచయం చేయాలని కూడా చూస్తున్నట్లు వివరించింది. అయితే ఇంకో రెండు రకాల మోటార్‌సైకిళ్ల వివరాలను మాత్రం తెలియజేయలేదు. కాగా, ఈ ఆటో ఎక్స్‌పోలో ఓ కొత్త ద్విచక్ర వాహనం, మరో సూపర్ బైక్‌ను ఆవిష్కరించేందుకు హోండా సిద్ధమైనట్లు సమాచారం.