బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 26: సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తులు జరుపుతోందని, 2020నాటికి మరో 28 కొత్త బొగ్గు గనులను అంది పుచ్చుకునేందుకు శరవేగంగా ముందుకెళ్తోందని సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ అన్నారు. 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీ య జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కోల్ ఇండియా పరిధిలోని 8 బొగ్గు కంపెనీలతో పోటీపడి 23 శాతం ఆధిక్యతతో ఉత్పత్తులు జరుపుతూ దేశంలోనే నెంబర్-1గా సింగరేణి ఎదిగిందన్నారు. అంతేగాక బొగ్గు ఉత్పత్తుల్లో చైనా, అమెరికా లాంటి దేశాలకు దీటుగా నిలుస్తున్నామని, అన్ని రంగాల్లో పురోగతులు సాధిస్తూ 2020 నాటికి సింగరేణి ప్రపంచంలోనే నంబర్-1గా నిలబడబోతోందని ఆయన అన్నారు. అలాగే 2020 నాటికి మరో 28 కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 2017-2019నాటికి 5 కొత్త బొగ్గు గనులను ప్రారంభించి ఉత్పత్తి దశలోకి తీసుకువస్తామని తెలిపారు. 2020 నాటికి సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 85 మిలియన్ టన్నులను సాధించాలని పనిచేస్తున్నామని చెప్పారు. సింగరేణి ఆధ్వర్యంలో తొలిసారిగా చేపట్టిన జైపూర్ థర్మల్ పవర్‌ప్లాంట్ నుండి మరో 4 నెలల్లో విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నిర్ణయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో మొదటి 9 నెలల్లో 432 లక్షల టన్నుల ఉత్పత్తి చేశామని, ఉత్పత్తి చేసిన బొగ్గును రికార్డు స్థాయిలో 7,669 రేక్‌ల ద్వారా ఆయా పరిశ్రమలకు సరఫరా చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తులోనేగాక సంక్షేమ పనుల్లో కూడా ముందంజలో ఉంటుందని అన్నారు. కాగా, ఈ సందర్భంగా సిఎండికి సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

జెండా వందనం అనంతరం మాట్లాడుతున్న సిఎండి శ్రీధర్