బిజినెస్

లక్షల కోట్లు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ, విదేశీ ప్రతికూల పరిణామాల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. ఫలితంగా లక్షలాది కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద ఆవిరైపోతోంది. ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా 1,631.59 పాయింట్లు క్షీణించింది. ఈ నెల 20న 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. దీంతో మదుపరుల సంపద 7.9 లక్షల కోట్ల రూపాయలకుపైగా హరించుకుపోయింది. బిఎస్‌ఇలోని సంస్థల మార్కెట్ విలువ ఈ నెలలో 7,96,903 కోట్ల రూపాయలు దిగజారి 92,40,831 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత నెల డిసెంబర్ 31న ఇది 1,00,37,734 కోట్ల రూపాయలుగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మందగమనం, ఆ దేశ వృద్ధిరేటు పతనం, అక్కడి కరెన్సీ విలువలో చోటుచేసుకుంటున్న క్షీణత.. ప్రస్తుతం ప్రపంచ దేశాలనే వణికిస్తోంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపైనా కనిపిస్తోంది. దీనికితోడు గ్లోబల్ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పడిపోతున్న ముడి చమురు ధరలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఇక ఎలాగూ దేశీయంగా ప్రతికూలతలు ఉండనే ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతకంతకూ క్షీణిస్తున్న ఎగుమతులు, మరోవైపు పెరిగిపోతున్న దిగుమతుల భారం, డాలర్‌తో పోల్చితే పతనమవుతున్న రూపాయి మారకం విలువ, తగ్గుతున్న వృద్ధిరేటు అంచనాలు, కీలక బిల్లుల ఆమోదంపై అనుమానాలు, ఆర్థిక సంస్కరణల అమల్లో జాప్యం.. తద్వారా విదేశీ మదుపరుల్లో ఆందోళనలు, వారి పెట్టుబడుల ఉపసంహరణలు ఆయా సంస్థల షేర్ల విలువను అమాంతం పడేస్తున్నాయి. ‘చైనా ఆర్థిక వ్యవస్థలో బలహీనత, పడిపోతున్న ముడి చమురు ధరలు.. గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను నష్టపరుస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అపనమ్మకంతో విదేశీ మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామం భారతీయ మార్కెట్లను కుంగదీస్తోంది.’ అని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా అన్నారు.
ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ మదుపరులు దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్‌పై ఆశాజనకమైన అంచనాలు నిపుణుల నుంచి కూడా రాకపోవడం గమనార్హం. కాగా, గత ఏడాది సెనె్సక్స్ 1,381.88 పాయింట్లు లేదా 5 శాతం దిగజారగా, అంతకుముందు సంవత్సరం 2014లో మాత్రం సుమారు 30 శాతం ఎగిసింది. ఇకపోతే 2015లో బిఎస్‌ఇ మదుపరుల సంపద 2 లక్షల కోట్ల రూపాయలు ఎగబాకింది. కొత్త సంస్థలు స్టాక్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున ప్రవేశించడమే దీనికి కారణం. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో స్టాక్ మార్కెట్లు మదుపరులు పెట్టుబడుల జోరుతో ఏ స్థాయిలో లాభాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు విదేశీ మదుపరులలో మోదీపై సన్నగిల్లిన విశ్వాసం కూడా స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నకొద్దీ.. మదుపరుల సంపద మాయమవుతోంది.