బిజినెస్

రూ. 48 వేల కోట్లు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) ఈ నెలలో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 48,000 కోట్ల రూపాయల (7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఒక్క భారతీయ మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లిపోయినవే 11,000 కోట్ల రూపాయల (1.64 బిలియన్ డాలర్లు)కుపైగా ఉండటం గమనార్హం. ‘ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా (జనవరి 1-24) ఆసియా స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.’ అని ఓ హెచ్‌ఎస్‌బిసి నివేదిక తెలిపింది.
2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి గమనిస్తే జనవరిలో ఈ స్థాయిలో పెట్టుబడులు తరలిపోవడం ఇదేనని పేర్కొంది. కాగా, దక్షిణ కొరియా, తైవాన్ స్టాక్ మార్కెట్ల నుంచి అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల చొప్పున విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఇక ఫిలిప్పిన్స్ స్టాక్ మార్కెట్ల నుంచి అత్యల్పంగా 97 మిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు.