బిజినెస్

చమురు దిగుమతులపై మళ్లీ 5% సుంకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు గణనీయంగా తగ్గి గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి దిగిరావడంతో ముడి చమురు దిగుమతులపై మళ్లీ 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించి దాదాపు 18 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2011 జూన్‌లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు పైగా చేరుకోవడంతో చమురు దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని శాతం నుంచి 0 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 30 డాలర్ల వద్ద తిరుగాడుతుండటంతో దిగుమతులపై ప్రభుత్వం మళ్లీ 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌లో వచ్చే నెల 29వ తేదీన 2016-17 సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగించకుండా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ముడి చమురుపై మళ్లీ దిగుమతి సుంకాన్ని విధించడమే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇదే గనుక జరిగితే దేశంలోని చమురు రిఫైనరీలపై ప్రభుత్వం విధించే సుంకానికి అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌తో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలు సమాన దామాషాలో పెరుగుతాయి. దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌పై 2.5 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్న విషయం విదితమే. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తుల కంటే దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలను అధికంగా ఉంచడం ద్వారా దేశీయ చమురు పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం ఈ సుంకంలో వ్యత్యాసాన్ని కొనసాగిస్తోంది. 2016-17 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని పెంచితే అనుబంధ ఉత్పత్తులపై సుంకం కూడా 2.5 శాతం నుంచి 7.5 శాతానికి పెరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దాదాపు 30 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురుపై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధిస్తే ప్రభుత్వానికి 18 వేల కోట్ల రూపాయల అదనపు రాబడి వస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

పంట నష్టాల అంచనాకు
త్వరలో డ్రోన్ల సాయం
న్యూఢిల్లీ, జనవరి 28: దేశంలో వ్యవసాయ నష్టాలను వేగవంతంగా, మరింత కచ్చితంగా అంచనావేసి పంటల బీమా క్లెయిములను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మానవ రహిత వైమానిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ‘డ్రోన్ల’ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అమలులోకి తీసువచ్చిన పంటల బీమా పథకంలో ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. డ్రోన్ సాంకేతి పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు ఎంఎన్‌సిఎఫ్‌సి (మహాలానోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్)కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడం జరిగిందని, ఇందుకు సంబంధించి వచ్చే నెలలో ఇ-టెండర్ జారీ అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రభుత్వం తొలుత ఒక రకమైన డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేస్తుందని, దాని పనితీరును, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాంకేతిక పరిజ్ఞానాల కొనుగోలుకు ఉపక్రమిస్తుందని ఆయన వివరించారు.