బిజినెస్

పర్యాటక ఆదాయంపై ఏపి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 28: పర్యాటకులను ఆకర్శించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ, విదేశాల్లో పర్యాటక రంగం అందిస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో నూతన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కడప, నెల్లూరు, శ్రీకాకుళం మినహా ఇతర అన్ని జిల్లాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని పర్యాటకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పే ఈ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించింది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో పర్యాటకులను ఆకర్శించడానికి బీచ్ రీసార్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతేగాక పలు జిల్లా కేంద్రాల్లో కనె్వన్షన్ సెంటర్లు, ఎగ్జిబిషన్, హోటళ్లు నిర్మించి ఆయా నగరాల ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. పర్యాటకశాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో విజయనగరం జిల్లా తాటిపూడిలో రూ. 9 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో లేక్ రీసార్టు, విజయనగరంలో రూ. 40 కోట్లతో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మించనున్నారు. విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలంలో కనె్వన్షన్ సెంటర్, రెస్టారెంట్, రుషికొండలో రూ. 50 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో బీచ్ రీసార్టు ప్రతిపాదించారు. గాజువాక, షీలానగర్‌లో రూ. 10 కోట్లతో షాపింగ్‌మాల్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎండాడలో రూ. 25 కోట్లతో బీచ్ రీసార్టు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోగులంకలో రూ. 10 కోట్ల వ్యయంతో 13.62 ఎకరాల్లో రీసార్టు, చింతలమోడిలో 10 ఎకరాల్లో రూ. 10కోట్లతో బీచ్ రీసార్టుకు ప్రతిపాదించారు. పుణ్యక్షేత్రం అన్నవరంలో రూ. 10 కోట్ల ఖర్చుతో హోటల్ నిర్మించనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 40 కోట్లతో బీచ్ రీసార్టు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కృష్ణా జిల్లా మంగినపూడిలో రూ. 40 కోట్లతో బీచ్ రీసార్టు ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా సూర్యలంకలో 8 ఎకరాల విస్తీర్ణం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, వాడ్రేవు, చీరాలలో బీచ్ రీసార్టు నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఒంగోలు పట్టణంలో రూ. 30 కోట్ల వ్యయంతో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మాణానికి సిఫారసు చేశారు. చిత్తూరు జిల్లా హార్స్‌లీహిల్స్‌లో రూ. 50 కోట్ల ఖర్చుతో 5 స్టార్ హోటల్, చిత్తూరు నగరంలో రూ. 25.5 కోట్లతో 3 స్టార్ హోటల్ నిర్మించడానికి అనుమతించాలని కోరారు. హార్స్‌లీ హిల్స్‌లో రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదించారు. కళ్యాని డ్యాంలో లేక్ రీసార్టు నిర్మించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కనె్వన్షన్ సెంటర్, హోటల్, ఎగ్జిబిషన్‌తో పాటు బెలూంగుహల వద్ద రీసార్టు నిర్మాణానికి పర్యాటకశాఖ ప్రయత్నిస్తోంది. అనంతపురం నగర శివారులో నిర్మించిన శిల్పారామంలో కనె్వన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్, హోటల్ నిర్మించాలని, గుత్తికోటలో రోప్‌వే ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను రానున్న మూడేళ్లలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.